ప్రభుత్వం బీదవారికి, అట్టడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలు అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలను తీసుకువస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకువచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ శాతం సద్వినియోగం అయినా... కొంతమంది మాత్రం వాటిని దుర్వినియోగం చేసేందుకే ఉన్నామంటు ముందుకు వస్తారు. ( Ambulance used as taxi ) బీదలకు , అవసరమున్నవారికి దక్కాల్సిన సేవలను, వారికి అనుకూలంగా మార్చుకుంటారు. ప్రభుత్వ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని ఎంజాయ్ చేస్తారు. మరోవైపు ప్రభుత్వ సోమ్మె కదా మాకేందుకులే అనే అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఉండడంతో వారి దుర్వినియోగం యధేచ్చంగా కొనసాగుతుంటుంది.
ఈ క్రమంలోనే ఓ ప్రబుధ్దడు చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ఇది చదివితే బద్దకస్తులు ఈరకంగా కూడా ఉంటారా అని ముక్కున వేలు వేసుకోవడం ఖాయం. ఇక విషయానికి వస్తే..అత్యవసర సేవల కోసం ఉపయోగించుకోవాల్సిన అంబులెన్స్ సేవలను తన స్వంతానికి ఫ్రీగా వాడుకున్నాడు.( Ambulance used as taxi ) అది కూడా ఒక్కసారి కాదు.. 39 సార్లు ఆనారోగ్యం పేరుతో ప్రయాణం చేసేందుకు ఉపయోగించుకున్నాడు ఆ ప్రబుద్దుడు.. అదికూడా నడవడం చేతకాక అంబులెన్స్ వాడుకున్నాడు.
Aadilabad : చాలన్లు వేస్తున్నారని పోలీసుల ముందే..తన బైకుకు తానే నిప్పు
వివరాల్లోకి వెళితే.. తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరుకుల కోసం సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు.. ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్లడం ఎందుకు డబ్బులు దండగ అని అనుకున్నాడు.. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి తనకు అస్వస్థతగా ఉందని చెప్పి.. దాంట్లో ఫ్రీగా ప్రయాణం చేసేవాడు. ( Ambulance used as taxi )తాను చెప్పిన ఆసుపత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్ సిబ్బందిని కోరేవాడు. అంబులెన్స్ ఆసుపత్రిలో అతడిని దింపగానే అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయేవాడు. ఎందుకంటే ఆ ఆసుపత్రికి అతని ఇంటికి చాలా దగ్గరగా ఉండడమే ఇందుకు కారణం.
మరో ట్విస్ట్ ఎమిటంటే.. తాను వెళ్లిని సూపర్ మార్కెట్ నుండి తన ఇంటికి కేవలం 200 మీటర్లు ఉండడం గమనార్హం. అయితే.. చాలాసార్లు అంబులెన్స్‌లో వచ్చి చెకప్ చేయించుకోకుండా వెళ్లిపోతున్న అతడిపై హాస్పిటల్ సిబ్బందికి ఓ సారి అనుమానం కలిగింది.( Ambulance used as taxi ) దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గురుడి అసలు విషయాన్ని బయటపెట్టారు.. ఇంకోసారి అలా చేస్తే జైలులో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని హెచ్చరించి వదిలిపెట్టారు. మొత్తం మీద ఇలా కనీసం రెండు కిలోమీటర్లు కూడా లేని ఇంటికి ఇలా సంవత్సర కాలంలో 39 సార్లు అంబులెన్స్ సేవలను వాడుకున్నాడంటే ..ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనేది తెలుసుకోవాల్సిన అంశం.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Free ambulance, International news