AMAZON FOUNDER JEFF BEZOS SPACE TOUR GOT SUCCESSFUL TOTAL TOUR FINISHED IN 11 MINUTES AK
అంతరిక్ష టూర్ సక్సెస్.. ఫలించిన అమెజాన్ అధినేత ప్రయోగం
జెఫ్ బెజోస్, ఇతరులు
రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లే సమయంలో గంటకు 3700 కిలోమీటర్లు వేగాన్ని రాకెట్ అందుకుంది. కొద్ది నిమిషాలకే అందులోని వాళ్లు సీటు బెల్టులను తొలగించి అందులో తేలిపోవడాన్ని ఆస్వాదించారు.
అంతరిక్షంలోకి వెళ్లి రావాలనే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కల నెరవేరింది. అంతరిక్ష పర్యటనను ప్రొత్సహించాలనే ఆయన లక్ష్యం కూడా నెరవేరించింది. జెఫ్ బెజోస్‌తో పాటు మరో ముగ్గురితో కూడిన 'న్యూ షెపర్డ్' ప్రయోగం విజయవంతమైంది. నలుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెపర్డ్ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగించారు. పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్ సైట్ వన్ నుంచి మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు న్యూ షెపర్డ్ ప్రయోగం మొదలైంది.
రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లే సమయంలో గంటకు 3700 కిలోమీటర్లు వేగాన్ని రాకెట్ అందుకుంది. కొద్ది నిమిషాలకే అందులోని వాళ్లు సీటు బెల్టులను తొలగించి అందులో తేలిపోవడాన్ని ఆస్వాదించారు. అనంతరం ఆరు నిమిషాలకు రాకెట్ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ప్రయోగ వేదికకు 3.2కిలోమీటర్ల దూరంలోని ల్యాండింగ్ ప్యాడ్‌కు చేరుకుంది. సుమారు 15నిమిషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పాల్గొన్న నలుగురు వ్యోమగాములు విక్టరీ సంకేతం చూపిస్తూ రాకెట్ నుంచి బయటకు వచ్చారు. ఈ యాత్రలో అమెజాన్ అధినేత బెజోస్, ఆయన మార్క్, మహిళా పైలట్ వేలీ ఫంక్ (82), ఆలివర్ డేమన్ (18) ఉన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.