హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

World's Richest Person: మళ్లీ ఆయనే నంబర్ వన్.. మస్క్ కంపెనీ షేర్లు పడిపోవడంతో టాప్ ప్లేస్‌కు అమెజాన్ సీఈవో

World's Richest Person: మళ్లీ ఆయనే నంబర్ వన్.. మస్క్ కంపెనీ షేర్లు పడిపోవడంతో టాప్ ప్లేస్‌కు అమెజాన్ సీఈవో

జెఫ్ బెజోస్

జెఫ్ బెజోస్

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానంలో నిలిచారు. స్పెస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఆరు వారాల తర్వాత అమెజాన్ యజమాని మళ్లీ నంబర్ 1 స్థానాన్ని...

ఇంకా చదవండి ...


వాషింగ్టన్: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానంలో నిలిచారు. స్పెస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. ఆరు వారాల తర్వాత అమెజాన్ యజమాని మళ్లీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు 2.4 శాతం క్షీణించడంతో ఆ సంస్థ ఏకంగా 4.6 బిలియన్ డాలర్లను కోల్పోయింది. దీంతో.. జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చోటు దక్కించుకున్న మస్క్ తాజాగా ఆ స్థానాన్ని కోల్పోయారు. 2017 నుంచి అమెజాన్ సీఈవో బెజోస్ ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి స్థానంలో అప్రతిహతంగా కొనసాగారు. అమెజాన్ షేర్ల విలువ రానురాను విపరీతంగా పెరిగింది. దీంతో.. ఆయన ఆస్తి విలువ కూడా పెరిగింది.

అయితే.. గత జనవరిలో టెస్లా షేర్ల విలువ అనూహ్యంగా పెరగడంతో బెజోస్ నంబర్ వన్ స్థానాన్ని మస్క్ చేజిక్కించుకున్నారు. దాదాపు ఆరు వారాల తర్వాత టెస్లా షేర్లు పడిపోవడంతో మళ్లీ ఆయన నంబర్ 2కు పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే.. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి రాబోయే ఏడాదిలో తప్పుకోనున్నట్లు బెజోస్ ప్రకటించిన తరుణంలో ఆయన మళ్లీ సంపన్నుల జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. బెజోస్ ఆస్తి విలువ ప్రస్తుతం 191.2 బిలియన్ డాలర్లు. బెజోస్ అమెజాన్ సీఈవోగా తప్పుకున్న అనంతరం ఆ బాధ్యతలను ఆండీ జాస్సీ స్వీకరించనున్నారు.

ప్రస్తుతం ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అయితే. సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా అమెజాన్‌తోనే ఉంటానని జెఫ్ బెజోస్ ఉద్యోగులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. తన స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్‌పై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

First published:

Tags: Amazon, Elon Musk, Jeff Bezos, Tesla Motors

ఉత్తమ కథలు