Home /News /international /

AMAZON EX CEO JEFF BEZOS FUTURE PLANS READY COMING SOON HE WILL ANNOUNCE HIS NEW PROJECTS NGS

Jeff Bezos: బై బై జెఫ్‌ బెజోస్.. ఫ్యూచర్ ప్లాన్ ఇదే.. ఆస్థి విలువ ఎంతో తెలుసా..? అమేజాన్‌ ప్రస్థానం ఎలా మొదలైంది?

జెఫ్ బెజోస్

జెఫ్ బెజోస్

Jeff Bezos: అమెరికా నుంచి అనకాపల్లి వరకు అమెజాన్ సేవలను విస్తరించి ఈ కామర్స్ లో సంచలనంగా మారిన జెఫ్‌ బెజోస్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి.,? ఎందుకు ఆయన అమెజాన్ సీఈవో పదవికి బైబై చెప్పారు..? ప్రస్తుతం అతని ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

  Jeff Bezos: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతకు పరిచయం అవసరం లేని పేరు జెఫ్ బెజోస్. అపర కుబేరుడిగా ఎన్నో సార్లు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆయన.. ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అయ్యారు. అమేజాన్‌ అనే బ్రాండ్‌ను విశ్వ వ్యాప్తం చేశారు ఆ సంస్థ సీఈఓ జెఫ్‌ బెజోస్‌. మూడు దశాబ్దాలుగా అమేజాన్‌ సీఈఓగా విధులు నిర్వర్తిస్తోన్న బెజోస్‌ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో  ఇప్పుడు ఆయన ఏం చేస్తారు..? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..? ఇలా ఎన్నో ఆసక్తిర అంశాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమేజాన్‌ పేరు తెలియని సగటు మనిషి ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. అమెరికా నుంచి అనకాపల్లి వరకు అమేజాన్‌ తన సేవలను అందిస్తోంది. అమేజాన్‌ ఈ స్థాయికి చేరుకోవడానికి ఆ సంస్థ సీఈఓ బెఫ్‌ బెజోస్‌ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా వెలిగిన బెజోస్‌ అమేజాన్‌ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు.  దీంతో నేటి నుంచి ఆయన ఏం చేయబోతున్నారనే ప్రశ్నలు తలెత్తులున్నాయి.

  బెజోస్‌ కేవలం అమేజాన్‌ సీఈవోగా మాత్రమే తప్పుకున్నారు. కానీ పని నుంచి కాదు.. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేయడానికి ప్రారంభించిన బ్లూ ఆరిజిన్‌ ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’‌, వాతావరణ మార్పులపై పోరాడేందుకు ప్రారంభించిన ‘బెజోస్ ఎర్త్ ఫండ్’‌, డే 1 ఫండ్‌ ప్రాజెక్టులపై బెజోస్‌ దృష్టి సారించనున్నారు. తన సోదరుడు మార్క్‌ బెజోస్‌తో కలిసి త్వరలో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు.

  ఇదీ చదవండి: ష‌ర్మిళ పార్టీకి వ్యూహాక‌ర్త ఎవరో తెలుసా ? త్వరలోనే క్యాడ‌ర్ కు ప‌రిచ‌యం? ఆమె నేపథ్యం ఇదే

  1995లో అమెజాన్‌ పేరిట పుస్తకాలు అమ్మేందుకు ఓ చిన్న ఆన్‌లైన్ సంస్థను స్థాపించిన బెజోస్‌ దాన్ని అంచెలంచెలుగా పెంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్‌ సంస్థగా తీర్చిదిద్దారు. అమెజాన్‌ నికర అమ్మకాలు 2020లో 38610 కోట్ల డాలర్లు.. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.28.95 లక్షల కోట్లకు చేరాయి. 2026 నాటికి జెఫ్ బెజోస్ సంపద ఒక ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కాముర్స్ లో సంచలనాలు చేసిన ఆయన. బ్లూ ఆరిజిన్‌తో అంతరిక్ష రంగంలో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తారో చూడాలి. ఇదీ చదవండి: యువతీ, యువకుల తల్లిదండ్రులకు అలర్ట్.. మానసిక ఒత్తిడికి అదే కారణం..? ఏం చేయాలి..?

  మరోవైపు అమెజాన్‌ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ సేవల వైపు మొగ్గు చూపడంతో అమెజాన్ 2020లో గణనీయంగా లాభాలను గడించింది. దీంతో అమెజాన్‌ వ్యవస్తాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్ వ్యక్తిగత సంపద గణనీయంగా పెరిగింది.సుమారు 2020 సంవత్సరంలో 75 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా జెఫ్‌ బెజోస్‌ 1994 జూలై 5 న తొలిసారిగా అమెజాన్‌తో ఆన్‌లైన్‌లో పుస్తకాలను విక్రయించడం మొదలుపెట్టారు.

  ఇదీ చదవండి: బీజేపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి ఆ కీలక నేత.. రివర్స్ అవుతున్న కమలం ప్లాన్

  జెఫ్‌ బెజోస్‌ సంపద విషయానికొస్తే.. బెజోస్ మొత్తం బ్రిటిష్ రాజకుటుంబ సంపద కంటే రెండింతలు ఎక్కువ సంపదతో పదవి విరమణ తీసుకున్నారు. బ్రిటిష్ రాజకుటుంబం సంపద సుమారు 88 బిలియన్‌ డాలర్లను కలిగి ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 203 బిలియన్ల డాలర్లు ఉంది. 2018 నుంచి 2020 వరకు బిల్ గేట్స్ నికర ఆస్తి విలువ .6.12 లక్షల కోట్ల నుంచి రూ .8.58 లక్షల కోట్లకు ఏగబాకింది. ఒక నివేదిక ప్రకారం, అతని సంపద 73 శాతం పెరిగింది. బెజోస్‌ తన పెన్షన్‌ను కవర్ చేయడానికి సుమారు 197 బిలియన్ డాలర్లను కలిగి ఉన్నట్టు అంచనా.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Amazon, International news, Jeff Bezos

  తదుపరి వార్తలు