భారీ తిమింగలం... స్లో మోషన్ వీడియో వైరల్...

Humpback Whale : సముద్రంలో వెళ్తున్నప్పుడు డాల్ఫిన్లు మనతో ఆడుకుంటాయి గానీ... తిమింగలాలు మన దగ్గరకు రావు. అలాంటిది ఆ భారీ తిమింగలం ఒక్కసారిగా వచ్చి ఆశ్చర్యపరిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 14, 2019, 10:17 AM IST
భారీ తిమింగలం... స్లో మోషన్ వీడియో వైరల్...
భారీ తిమింగలం... స్లో మోషన్ వీడియో వైరల్ (Source - FB - Cassie Jensen)
  • Share this:
ఈ ప్రపంచం అద్భుతమైనది. భూమిపై, సముద్రంలో రకరకాల జీవులు. వాటిలో అతి పెద్ద జీవి హంప్‌బ్యాక్ తిమింగలం. సముద్రంలో అరుదుగా కనిపించే తల్లి తిమింగలం... ఒక్కసారిగా సముద్రంపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. తోంగాలో సముద్రంపై ప్రయాణిస్తున్న కాస్సీ జెన్సెన్‌కి వింత అనుభవం ఎదురైంది. భారీ తిమింగలం... సముద్రంలోంచీ బయటకు వచ్చి... తిరిగి లోపలికి వెళ్లిపోయింది. స్వతహాగా ఫొటోగ్రాఫర్, పర్యావరణవేత్త అయిన కాస్సీ... వెంటనే దాన్ని వీడియో తీశారు. స్లో మోషన్‌లో దాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఇప్పుడీ వీడియో అందర్నీ ఆకర్థిస్తోంది. తిమింగలం రావడమే ఓ వింత అనుకుంటే... ఆ దృశ్యాల్ని అంతే చక్కగా వీడియోలో బంధించారంటూ... కాస్సీని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading