అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ కోసం ఐరాసకు పాక్ విజ్ఞప్తి..

హఫీజ్ కుటుంబ మనుగడ కోసం డబ్బు అవసరం అని.. అతని బ్యాంకు ఖాతా నుంచి 1,50,000PKR(1000 డాలర్లు) విత్ డ్రా చేసేందుకు అనుమతినివ్వాలని ఐరాసను పాక్ కోరింది.

news18-telugu
Updated: September 26, 2019, 10:51 AM IST
అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ కోసం ఐరాసకు పాక్ విజ్ఞప్తి..
హఫీజ్ సయీద్‌(File Photo)
  • Share this:
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని పాకిస్తాన్ ఐరాస భద్రతా మండలిని కోరింది. తన కుటుంబ కనీస అవసరాలు తీర్చేందుకు గాను ఈ వీలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. పాక్ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా కౌన్సిల్‌లోని సభ్యులను ఐరాస కోరింది. అభ్యంతరాలేవీ వ్యక్తం కాకపోవడంతో.. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఉపయోగించేందుకు అనుమతినిచ్చింది.కాగా,ముంబై 26/11 పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి..అతని బ్యాంకు ఖాతాలను నిలిపివేసింది. అయితే హఫీజ్ కుటుంబ మనుగడ కోసం డబ్బు అవసరం అని.. అతని బ్యాంకు ఖాతా నుంచి 1,50,000PKR(1000 డాలర్లు) విత్ డ్రా చేసేందుకు అనుమతినివ్వాలని ఐరాసను పాక్ కోరింది. కౌన్సిల్ సభ్యుల ఆమోదం మేరకు ఆ డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఐరాస అనుమతినిచ్చింది.
Published by: Srinivas Mittapalli
First published: September 26, 2019, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading