Home /News /international /

ALL THE CHURCHES IN SRI LANKA ARE CLOSED FOR SOME DAYS BY GOVERNMENT SUGGESTION NK

శ్రీలంకలో మూతపడిన చర్చిలు... మరో ప్రాణ నష్టం జరగకుండా...

శ్రీలంకలో ఓ దృశ్యం

శ్రీలంకలో ఓ దృశ్యం

Sri Lanka Bomb Blast : శ్రీలంకలో తాజాగా 11వ బాంబు పేలడంతో తాత్కాలికంగా చర్చిలను మూసివేశారు. రక్షణ శాఖ ప్రతిపాదనకు అంగీకరించారు మత పెద్దలు.

శ్రీలంకలో పరిస్థితి ఏమాత్రం బాలేదు. పైకి పూర్తి సెక్యూరిటీ ఉందని సైన్యం చెబుతున్నా... ఎప్పుడు, ఎక్కడ ఏ బాంబు పేలుతుందోననే టెన్షన్ ఉండనే ఉంది. అందుకే ఎందుకైనా మంచిదని అక్కడి చర్చిలను తాత్కాలికంగా మూసివేద్దామని రక్షణ శాఖ కోరగా... అందుకు మత పెద్దలు కూడా ఒప్పుకున్నారు. కొన్ని రోజులపాటూ చర్చిలను మూసివేస్తున్నామనీ, ప్రజలు ఇళ్ల దగ్గరే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. చర్చిలను తిరిగి తెరిచిన తర్వాత, ప్రభుత్వమే ఆ విషయాన్ని ప్రకటిస్తుందనీ అప్పుడు మాత్రమే... తిరిగి చర్చిలకు రావాలని సూచించారు.

శ్రీలంక వాసులు కంటిమీద కునుకు లేకుండా బతుకుతుంటే... వాళ్లను మరింత భయపెడుతున్నాయి ఒక్కొక్కటిగా పేలుతున్న బాంబులు. తాజాగా... రాజధాని కొలంబో దగ్గర్లో తూర్పు వైపున ఉన్న పగోడా పట్టణంలో ఇవాళ మరో పేలుడు జరిగింది. అక్కడి మేజిస్ట్రేట్ కోర్టు వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. లక్కీగా ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో... ఎలాంటి నష్టమూ జరగలేదు. కోర్టుకు వచ్చే వాళ్ల ప్రాణాలు తీసేందుకే ఆ బాంబును అక్కడ పెట్టారని పోలీసులు భావిస్తున్నారు.

మొదట ఆదివారం 9 చోట్ల పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు... ఏప్రిల్ 24న మరో బాంబు అమర్చారు. సినిమా థియేటర్‌నే లక్ష్యంగా చేసుకుని... బాంబును సెట్ చేశారు. కొలంబోని సావోయ్‌ థియేటర్‌ దగ్గర్లో ఓ బైక్‌లో ఈ బాంబు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐతే... దాన్ని తొలగించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆ బాంబు పేలిపోయింది. బైకు తుక్కు తుక్కైంది. నిజంగా అది పేలినప్పుడు ప్రజలు ఉండి ఉంటే... దాదాపు ఐదారుగురు చనిపోయేవారని పోలీసులు తెలిపారు.

శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 359 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం శ్రీలంకలో హైఅలర్ట్ కొనసాగుతోంది. తరచూ బాంబులు పేలుతుండటంతో... మరిన్ని ఉగ్ర దాడులు జరగొచ్చన్న అంచనాలతో అణువణువూ గాలిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

న్యూడ్ వీడియోలు పంపు లేదంటే... కాబోయే నటికి కాస్టింగ్ డైరెక్టర్ బ్లాక్ మెయిల్...

ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యం... స్థానికులకే ప్రాధాన్యం... ఆమ్ ఆద్మీ పార్టీ మ్యానిఫెస్టో విడుదల...

ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...

పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...
First published:

Tags: International, Sri Lanka, Sri Lanka Blasts, Terrorism, World

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు