Home /News /international /

ALL REPORTS ABOUT KIDNAPPING OF INDIANS IN AFGHANISTAN ARE WRONG SAYS TOP GOVERNMENT SOURCES NK

ఆఫ్ఘనిస్థాన్‌లో భారతీయుల పరిస్థితేంటి?.. తాలిబన్లు కిడ్నాప్ చేశారా?

ఆఫ్ఘనిస్థాన్ (image credit - twitter - reuters)

ఆఫ్ఘనిస్థాన్ (image credit - twitter - reuters)

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు... భారతీయుల్ని కిడ్నాప్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై కేంద్ర వర్గాలు ఏం చెప్పాయి? నమ్మదగిన సోర్సుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    మన దేశంలో సోషల్ మీడియాపై పెద్దగా కంట్రోల్ లేకపోవడంతో... సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వార్తలు ఇచ్చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఆప్ఘనిస్థాన్ విషయంలోనూ కొన్ని అకౌంట్లలో అసత్య ప్రచారాలు ఎక్కువచ్చాయి. ప్రధానంగా... ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు భారతీయుల్ని కిడ్నాప్ చేశారనీ.... వేర్వేరు దేశాలకు చెందిన వారిని బంధించగా... వారిలో భారతీయులు కూడా ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఐతే... కేంద్ర ప్రభుత్వ దగ్గర అత్యంత నమ్మదగిన వ్యక్తుల సమాచారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అసలు ఆఫ్ఘనిస్థాన్‌లో భారతీయులకు ఎలాంటి సమస్యా లేదు. అక్కడి తాలిబన్లు భారతీయుల జోలికి రాలేదు. భారతీయులకు సంబంధించి కిడ్నాప్ అనే మాటే లేదు. భారతీయులంతా క్షేమంగా ఉన్నారు.

    ఆప్ఘనిస్థాన్‌లోని కొందరు అధికారులు భారతీయులకు అండగా ఉన్నారు. ఇండియన్స్‌ని సేఫ్‌గా ఇండియా పంపించేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... తాలిబన్లు భారతీయుల్ని ఏమీ అనట్లేదు. వాళ్లను ఆప్ఘనిస్థాన్‌లోనే ఉండమని కోరుతున్నారు. తమ దేశాన్ని అభివృద్ధి చెయ్యమని భారతీయుల్ని కోరుతున్నారు. కానీ తాలిబన్లను నమ్మే పరిస్థితి లేకపోవడంతో... భారతీయులు అక్కడి నుంచి వీలైనంత త్వరగా ఇండియా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా... ఎయిర్ కంట్రోల్ అమెరికా చేతిలో ఉండటంతో... అమెరికాతో సంప్రదింపులు జరుపుతూ... గగనతల మార్గంలో వారిని ఇండియా తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

    తాలిబన్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది ఆప్ఘనిస్థాన్ ప్రజలనే. ఇంతకాలం అక్కడి ప్రజలు... అమెరికా సంయుక్త దళాలకు అండగా నిలిచారనే ఉద్దేశంతో... తాలిబన్లు వారిపై కక్ష గట్టారు. అమెరికాకు సహకరించిన ఎవ్వర్నీ వదిలే ప్రసక్తి లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాడులు చేస్తూ, కాల్పులు జరుపుతూ... తిరిగి పూర్వపు అరాచకాలన్నీ చేస్తున్నారు. ఐతే... ఇప్పటివరకూ వారు భారతీయుల జోలికి రాలేదని తెలుస్తోంది. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... తాజాగా నియంత్రుత్వ పాలనలు ఎక్కువ కాలం సాగవని చెప్పడం ద్వారా పరోక్షంగా తాలిబన్లకు హెచ్చరిక చేసినట్లైంది. అందువల్ల భారతీయుల విషయంలో తాలిబన్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటున్నారని సమాచారం.

    ఇది కూడా చదవండి : Video: గూడు కట్టుకున్న టైలర్ బర్డ్.. సూది, దారం వాడుతూ.!

    ఆప్ఘనిస్థాన్ మీడియాలో కూడా భారతీయులు క్షేమంగా ఉన్నారని అక్కడి మీడియా కూడా తెలిపింది. ఇండియా వెళ్లాలనుకునేవారి డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్లు చెప్పింది. "మేము 150 మందిని కిడ్నాప్ చేశామనీ... అందులో ఎక్కువ మంది భారతీయులే అని వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నాం" అని తాలిబన్ ప్రతినిధి తెలిపారు. "కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ మా తాలిబన్ బృంద సభ్యులు ఉన్నారు. మేము పర్మిషన్ లేకుండా ఎవర్నీ ఎయిర్‌పోర్టులోకి పంపట్లేదు" అని ఆయన తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Afghanistan, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు