హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Nobel Peace Prize : 2022 నోబెల్ శాంతి పురస్కారం లభించింది వీళ్లకే

Nobel Peace Prize : 2022 నోబెల్ శాంతి పురస్కారం లభించింది వీళ్లకే

నోబెల్ శాంతి బహుమతి వీళ్లకే

నోబెల్ శాంతి బహుమతి వీళ్లకే

Nobel Peace Prize : 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్​ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ. ఈ ఏడాది నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ఓ వ్య‌క్తితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల‌కు క‌లిపి ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Nobel Peace Prize : 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్​ శాంతి పురస్కారాన్ని(Nobel Peace Prize) ప్రకటించింది నోబెల్ కమిటీ. ఈ ఏడాది నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ఓ వ్య‌క్తితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల‌కు క‌లిపి ఇచ్చారు. మానవ హక్కుల కోసం ఉద్యమించిన వ్యక్తికి, సంస్థలకు కలిపి ఇస్తున్నట్లు నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ తెలిపింది. బెలార‌స్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల అడ్వ‌కేట్ అలెస్ బియాలియాస్కీ(Ales Bialiatski)తో పాటు ర‌ష్యాకు చెందిన మాన‌వ హ‌క్కుల సంస్థ‌ మెమోరియల్,ఉక్రెయిన్​ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ అయిన "సెంటర్​ ఫర్ సివిల్ లిబర్టీస్​" ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తున్నట్లు తెలిపింది.

నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెలిచిన‌వాళ్లు త‌మ స్వ‌దేశాల్లో సివిల్ సొసైటీ త‌ర‌పున పోరాటం చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంత‌రం ప్ర‌శ్నించార‌ని, పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ర‌క్షించిన‌ట్లు క‌మిటీ తెలిపింది. యుద్ధ నేరాల‌ను డాక్యుమెంట్ చేయ‌డంలో వాళ్లు అసాధార‌ణ సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపిన‌ట్లు తెలిపింది. శాంతి, ప్ర‌జాస్వామ్యం కోసం శాంతి పుర‌స్కార గ్ర‌హీత‌లు ఎంతో కృషి చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. అయితే ఇప్పటికే ఈ ఏడాదికి గాను వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

నోబెల్‌ బహుమతి గ్రహీతలకుసుమారు 9లక్షల డాలర్ల నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్‌ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా,1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.

PM Modi : గవర్నెన్స్ ఫోకస్ మారింది..ఐఏఎస్ లకు మోదీ కీలక సూచనలు

కాగా,నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న అలెస్ బియాలియాస్కీ..1980 ద‌శ‌కంలో బెలార‌స్‌ దేశంలో ప్రజాస్వామ్య ఉద్య‌మాన్ని ఆయ‌న న‌డిపారు. స్వ‌దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని, శాంతియుత అభివృద్ధిని కాంక్షిస్తూ ఆయ‌న త‌న జీవితాన్ని అంకితం చేశారు. వివాదాస్ప‌ద రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల ద్వారా ఆ దేశ అధ్యక్షుడు నియంతృత్వ శ‌క్తుల్ని పొందడాన్ని నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మాలు చెల‌రేగాయి. ఆ స‌మ‌యంలో 1998లో వియ‌స్నా సంస్థ‌ను స్థాపించిన‌ అడ్వ‌కేట్ అలెస్ మాన‌వ హ‌క్కుల కోసం తీవ్ర పోరాటం చేశారు. అధ్య‌క్ష అధికారాల‌ను వ్య‌తిరేకిస్తూ జైలుపాలైన ఆందోళ‌న‌కారులకు, వాళ్ల కుటుంబాల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. కొన్ని సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో ఆ సంస్థ పూర్తి స్థాయి మాన‌వ హ‌క్కుల సంస్థ‌గా రూపాంత‌రం చెందింది. రాజ‌కీయ ఖైదీల‌కు మ‌ద్దతుగా ఆ సంస్థ పోరాటం చేసింది. అలెస్ బియాలియాస్కీని అణ‌గ‌దొక్కేందుకు ఆయ‌న్ను 2011 నుంచి 2014 వ‌ర‌కు జైల్లో వేశారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా 2020లోనూ భారీ ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ఆ స‌మ‌యంలోనూ ఆయ‌న్ను మ‌ళ్లీ అరెస్టు చేశారు. ఎటువంటి విచార‌ణ లేకుండానే ఆయ‌న్ను ఇంకా జైలులో ఉంచారు

Published by:Venkaiah Naidu
First published:

Tags: Nobel Peace Prize

ఉత్తమ కథలు