news18-telugu
Updated: December 2, 2020, 2:40 PM IST
జిన్నా పేరుతో జిన్ను (Image: Twitter)
పాకిస్తాన్ జాతిపితగా పేరుపొంది మహమ్మద్ అలీ జిన్నా పేరును ఓ మద్యం బాటిల్‌కు పెట్టారు. జిన్ బాటిల్‌కు జిన్నా పేరు పెట్టినట్టు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మద్యం బాటిల్ పేరును కూడా అందులో చూపించాడు. ఆ బాటిల్ లేబుల్ మీద ‘మ్యాన్ ఆఫ్ ప్లెజర్’ జిన్నా స్మృతిలో అంటూ రాశారు. అయితే, ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే, దీన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ ధ్రువీకరించలేదు. పాకిస్తాన్ జాతిపితగా పేరుగాంచిన మహమ్మద్ అలీ జిన్నా బ్రిటిష్ పాలిత ఇండియాలో 1876 డిసెంబర్ 25న జన్మించారు. పాకిస్తాన్‌కు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ఆయన పోరాటం చేశారు. దీంతో ఆగస్టు 14, 1947న పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడే భారత్, పాకిస్తాన్ విడిపోయాయి. ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆ దేశానికి ఆయన ‘మహా నేత’గా మారారు. ఆయన పేరుతో కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. ‘మంచి స్కాచ్, విస్కీ, జిన్, పూల్ బిలియర్డ్స్, సిగరెట్లు, పోర్క్ సాస్‌లు ఎంజాయ్ చేసిన జిన్నా దానిపై వచ్చిన వ్యాఖ్యలను ఎప్పుడూ ఖండించలేదు.’ అని ఆ లేబుల్ మీద రాసి ఉంది. మత్తు పదార్థాలు, బెట్టింగ్‌లు ఇస్లాంకు వ్యతిరేకంగా పేర్కొంటారు. ఇస్లాంకు వ్యతిరేకం అని చెప్పిన వాటిని అది ఎంత గొప్ప పని కోసం అయినా సరే త్యజించాలని ఖురాన్లో రాసి ఉంది. దీనిపై పాకిస్తాన్ ట్విటర్ యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని జాతీయ పానీయంగా చేయాలని ఓ యూజర్ డిమాండ్ చేశారు. ‘జాతి పిత పేరుతో జిన్ను తెచ్చాం’ అని మరో యూజర్ ట్వీట్ చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 2, 2020, 2:34 PM IST