Home /News /international /

AIRPORT STAFF FIND 119 LIVE TARANTULAS HIDDEN INSIDE A PAIR OF SHOES MK GH

ఎయిర్‌పోర్ట్‌లో స్పైడర్‌ల స్మగ్లింగ్‌ను అడ్డుకున్న అధికారులు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

అంతర్జాతీయ విమానాశ్రయం (NAIA) సిబ్బంది పోలాండ్ నుండి వచ్చిన పార్శిల్లో సాలీడులను కనుగొన్నారు. ఈ పార్శిల్‌ను జనరల్ ట్రయాస్‌లోని కావిట్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి పంపుతున్నట్లు దానిపై రాసి ఉంది.

స్మగ్లింగ్ అంటే మనకు గుర్తొచ్చేది బంగారం ఒక్కటే. బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధమైన వ్యాపారాలను ప్రపంచ దేశాల కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడూ అడ్డుకుంటున్నారు. తాజాగా ఫిలిప్పీన్స్‌లోని విమానాశ్రయ సిబ్బంది సాలీడులను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఒక జత బూట్ల లోపల దాచిన 119 టరాన్టులా జాతి సాలెపురుగులను అధికారులు కనుగొన్నారు. బ్యూరో ఆఫ్ కస్టమ్స్ ఈ వివరాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఆ దేశంలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం (NAIA) సిబ్బంది పోలాండ్ నుండి వచ్చిన పార్శిల్లో సాలీడులను కనుగొన్నారు. ఈ పార్శిల్‌ను జనరల్ ట్రయాస్‌లోని కావిట్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి పంపుతున్నట్లు దానిపై రాసి ఉంది. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒక పార్శిల్ విచిత్రమైన ఆకారంలో ఉన్నట్లు అక్టోబర్ 28న కస్టమ్ అధికారులు గుర్తించారు. అనుమానంతో దాన్ని విప్పి చూడగా, బతికి ఉన్న 119 టరాన్టులా సాలీడులు కనిపించాయి. వాటిని చిన్నపాటి ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టారు. వీటిన్నంటినీ రన్నింగ్ షూల జతలో దాచి ఉంచి రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వారు అధికారిక ఫేస్బుక్‌ పేజీలో పంచుకున్నారు.

అంతరించిపోతున్న జాతి

స్వాధీనం చేసుకున్న టరాన్టులా సాలీడులను అక్టోబర్ 29న డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్ అండ్ నేచురల్ రిసోర్సెస్ వైల్డ్ లైఫ్ ట్రాఫిక్ మానిటరింగ్ యూనిట్ (DENR WTMU)కు అప్పగించారు. పార్శిల్ ఎవరి అడ్రస్‌కు పంపించారో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. టరాన్టులా జాతి సాలీళ్లు కాస్త పెద్దగా, వెంట్రుకలతో కనిపిస్తాయి. చాలా దేశాల్లో ప్రజలు వీటిని పెంచుకుంటారు. ఫిలిప్పీన్స్‌లో టరాన్టులా జాతి సాలెపురుగులను అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో చేర్చారు. వీటిని అక్రమంగా రవాణా చేసినా, వణ్యప్రాణులతో వ్యాపారం చేసినా జరిమానాతో పాటు ఆరు నెలలు జైలుశిక్ష లేదా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తారు.

గతంలో కూడా జరిగాయి

ఫిలిప్పీన్స్‌లో గతేడాది కూడా ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఓట్ మీల్, కుకీ బాక్సుల్లో ఉన్న 757 బతికి ఉన్న టరాన్టులాలను, ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి రవాణా చేస్తున్న 87 బతికి ఉన్న స్పైడర్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ రెండు పార్శిల్లూ పోలాండ్ నుండి ఆ దేశానికి వచ్చినట్టు వారు చెబుతున్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Smuggling

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు