విమానంలో నిల్చొని 6 గంటలు ప్రయాణం... తన సీటును భార్యకు ఇచ్చి...

భార్యపై నిస్వార్థమైన ప్రేమను చాటుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది? ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 9, 2019, 9:05 AM IST
విమానంలో నిల్చొని 6 గంటలు ప్రయాణం... తన సీటును భార్యకు ఇచ్చి...
భార్య కోసం సీటును త్యాగం చేసిన భర్త (Image : Twitter - Courtney Lee Johnson)
  • Share this:
సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులో... ఓ ప్రయాణికుడు విమానంలో నిల్చొని ఉన్నాడు. అతని భార్య నిద్రపోతూ ఉంది. ఆమె... తన సీటుతోపాటూ... తన భర్త సీటులో పడుకుంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు... ఇదీ అసలైన ప్రేమంటే అంటున్నారు. ఐతే... అతను 6 గంటల పాటూ అలాగే నిల్చొని విమానంలో ప్రయాణించాడని తెలియడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె రెండు సీట్లలో పడుకునే బదులు... తన సీటులోనే వెనక్కి ఆనుకొని పడుకొని ఉండాల్సింది అంటున్నారు. కార్ట్‌నీ లీ జాన్సర్... ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆమె భర్తను మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టాడు. "అతను ఆరు గంటలు నిల్చోవడం వల్లే... ఆమె నిద్రపోగలిగింది... అదీ ప్రేమంటే" అని ట్వీట్ చేశాడు.


ఐతే... ఈ ట్వీట్‌లో ఇంకే వివరాలూ లేవు. అది ఏ విమానం, ఎక్కడి నుంచీ ఎక్కడకు వెళ్లింది? ఆ భార్యాభర్తలు ఎవరు... ఈ డీటెయిల్స్ ఏవీ లేవు. అయినప్పటికీ... ట్విట్టర్ యూజర్లు దీన్ని మెచ్చుకుంటూ... 15 వేల మందికి పైగా లైక్ చెయ్యగా... 3వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. చాలా మంది ఆశ్చర్యపోతూ కామెంట్లు పెట్టారు. అసలు ఆరు గంటలు ఎలా నిల్చోగలిగాడు. నా వల్ల కాదు అన్నాడో యూజర్. ప్రేమను ఇలా చాటుకోవడం కష్టమే... నేనైతే మరో ఆప్షన్ వెతుక్కునేవాణ్ని అంటూ మరొకరు కామెంట్ చేశారు. "ఆమె తన భర్త భుజంపై వాలి పడుకోవచ్చు కదా... నా కోసం నా భర్త కూడా ఇలా చేస్తారు... కానీ నేను మాత్రం ఆమె లాగా నా భర్తను నిల్చోబెట్టను" అని ఓ మహిళా యూజర్ కామెంట్ పెట్టారు.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు