విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు... ఆ తర్వాత...

Scorpion : విమానంలో తేలు ఉండటమే ఓ విశేషమైతే... అది ప్రయాణికురాలిని కుట్టడం మరో కలకలం. ఇదెలా జరిగిందో, ఎక్కడో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 10, 2019, 10:28 AM IST
విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు... ఆ తర్వాత...
విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు (credit - Twitter - SpeedBird)
  • Share this:
New Delhi : ఇప్పటివరకూ మనం రైళ్లు, విమానాలకు సంబంధించి రకరకాల వింత వార్తలు విన్నాం. వాటిలో మరొకటి చేరింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం 1554లో ఈ ఘటన జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచీ అట్లాంటాకు విమానం బయలుదేరింది. ప్రయాణికులు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. ఇంతలో ఓ మహిళ వేసుకున్న ప్యాంట్స్‌లో కాళ్ల దగ్గర ఏదో ఉన్నట్లుగా అనిపించింది. కాలును అటూ ఇటూ కదిపి ఊరుకుంది. ఇంతలో కాలిపై ఏదో చురుక్కుమన్నట్లుగా అనిపించింది. మళ్లీ ప్యాంట్స్‌ని అటూ ఇటూ కదిపి అలాగే కూర్చుంది. మళ్లీ ఇంకోసారి చురుక్కుమనేసరికి... ఏంటా అని రెస్ట్‌రూంకి వెళ్లి ప్యాంట్స్ తీసింది. అంతే... ఓ నల్ల తేలు ప్యాంట్స్‌లోంచీ కిందపడింది. షాకైన ఆమె... విషయం విమాన సిబ్బందికి చెప్పింది. వెంటనే పారామెడిక్స్ వచ్చి ఆమెను టెస్ట్ చేశారు. విమానం అట్లాంటాలో దిగగానే... స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్కీగా ఆమెకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.


ఇలాంటిదే ఓ ఘటన 2017లో జరిగింది. ఓ కెనడా ప్రయాణికుడు తనను ఏదో కత్తితో గుచ్చినట్లు అనిపించిందని చెప్పాడు. అంతుకు ముందు కూడా ఓ విషపూరితమైన పాము విమానంలో కనిపించింది. అలాగే... కౌలాలంపూర్ నుంచీ వచ్చిన విమానం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత అందులో విషపూరితమైన బల్లులు, డ్రాగన్‌ను తెచ్చిన ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకున్నారు.తమిళంలో దుమ్మురేపుతున్న వరంగల్ బ్యూటీ ఆనందీ
ఇవి కూడా చదవండి :ఆ బొకే ఇచ్చినందుకు రూ.5000 ఫైన్ వేసిన IAS ఆఫీసర్...

భర్తను చంపేందుకు భార్య స్కెచ్... ఆ తర్వాత...

పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం...

మిస్ యూనివర్స్‌ 2019... సౌతాఫ్రికా బ్యూటీ జొజిబినీ టున్జీ

పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?
Published by: Krishna Kumar N
First published: December 10, 2019, 10:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading