హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Plane Crash : 72 మందితో కూలిన ప్రయాణికుల విమానం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Plane Crash : 72 మందితో కూలిన ప్రయాణికుల విమానం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

విమాన ప్రమాద దృశ్యం (image credit - twitter - @IamMayank_)

విమాన ప్రమాద దృశ్యం (image credit - twitter - @IamMayank_)

Plane Crash : ఎంత టెక్నాలజీ వచ్చినా.. దానితో సమస్యలూ అలాగే వస్తున్నాయి. అసలు ఆ విమానం ఎందుకు కూలిపోయింది? ఎక్కడ పడింది? వివరాలు తెలుసుకుందాం

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నేపాల్‌లో 72 సీట్లు కలిగిన ఓ ప్యాసింజర్ విమానం కూలిపోయింది. నేపాల్ లోని పోఖ్రా ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విమానానికి చెందిన యెతీ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. ఈ విమానం ఖాట్మండ్ నుంచి పోఖ్రా వెళ్తోందని తెలిసింది.

ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన కారణంగా పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికుల పరిస్థితేంటి? విమానం ఎందుకు కూలింది? సాంకేతిక లోపమా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.

ప్రయాణికుల్లో పది మంది భారతీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది. విమానం కూలినప్పుడు భారీగా పొగ, మంటలు చెలరేగాయి. ఇప్పటివరకూ 16 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఇటు హిమాచల్ ప్రదేశ్ , కాశ్మీర్ మొదలు నేపాల్ వరకూ విపరీతమైన వాతావరణం ఉంది. దట్టమైన మంచు కురుస్తోంది. ఇది విమాన ప్రయాణాలకు ఒకింత ఇబ్బంది కలిగిస్తోంది.

నేపాల్‌లో తరచూ వాతావరణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. విమాన, హెలికాప్టర్ ప్రయాణాలకు అక్కడి వాతావరణం ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది. అందువల్ల ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటన్నది తేలాల్సి ఉంది.

First published:

Tags: Nepal, Plane Crash

ఉత్తమ కథలు