కరోనావైరస్ (Coronavirus) సమయంలో ఉద్యోగులు తమకు నచ్చిన ప్రాంతం నుంచి వర్క్ చేశారు. కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో చాలు కంపెనీలు ఇల్లు లేదా ఆఫీసులో వర్క్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) అనే ఓ వెకేషన్ రెంటల్ కంపెనీ తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. తమ ఉద్యోగులు (Employees) ఆఫీస్, ఇల్లు లేదా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా (Work From Anywhere) పని చేసుకోవచ్చని ఈ కంపెనీ ప్రకటించింది. ఎంప్లాయిస్ తమ ప్రాధాన్యతను బట్టి పని చేయడానికి అనుమతిస్తామని ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగులు తమ వర్క్ ఎన్విరాన్మెంట్ను స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చని, వారి నిర్ణయం వారి జీతంపై ఎలాంటి ప్రభావం చూపదని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఈ కంపెనీ తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉద్యోగులను వేరే దేశం నుంచి కూడా పని చేయడానికి కంపెనీ అనుమతిస్తుంది. అయితే ఉద్యోగులు ప్రతి ప్రదేశంలో ఏడాదికి కనీసం 90 రోజుల వరకు ఉండాల్సి ఉంటుంది. వీరు ప్రపంచంలోని 170కి పైగా దేశాలలో నివసించవచ్చు, ఆ దేశాల్లో నుంచే పని చేయవచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ పన్ను, పేరోల్ ప్రయోజనాల కోసం పర్మినెంట్ అడ్రస్ అవసరమని సీఈఓ బ్రియాన్ చెస్కీ గురువారం ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్లో తెలియజేశారు. అలానే కొత్త వర్క్-ఫ్రమ్-ఎనీవేర్ డిజైన్‌కు సంబంధించి ఐదు ఇంపార్టెంట్ ఫీచర్లను సీఈఓ వివరించారు.
Sri Lanka : సంక్షోభం వేళ శ్రీలంక అధ్యక్షుడు సంచలన నిర్ణయం..ప్రధాని తొలగింపు!
1. వర్క్ ఫ్రం హోమ్ లేదా ఆఫీస్
ఉద్యోగులు ఎక్కడ ఎక్కువ ప్రొడక్టివ్ గా ఫీల్ అవుతున్నారో అక్కడే పనిచేసేందుకు కంపెనీ వెసులుబాటును కల్పిస్తోందని సీఈఓ చెప్పారు. చాలా మంది ఉద్యోగులు ఈ సౌలభ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఆఫీస్ బాధ్యతలను నిర్వహించడానికి మాత్రం కొంత మంది ఉద్యోగులు కార్యాలయంలో లేదా నిర్దిష్ట ప్రదేశంలో ఉండాలి.
2. నచ్చిన ప్రాంతాలకు వెళ్లి వర్క్ చేసుకోవచ్చు
ఉద్యోగులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లిపోవచ్చు. దీనర్థం కుటుంబానికి దగ్గరగా వెళ్లడం లేదా మీరు ఎప్పుడూ కలలుగన్న ప్రదేశంలో నివసించడం. ఏ ప్రాంతానికి మారిపోయినా శాలరీపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. జూన్ నుంచి జీతం, ఈక్విటీ రెండింటికీ దేశం వారీగా ఒకే పేమెంట్ ఆఫర్ చేస్తుంది. తక్కువ లొకేషన్-బేస్డ్ పే టైర్‌ని ఉపయోగించి పేమెంట్ తక్కువగా నిర్ణయించినట్లయితే... ఆ ఉద్యోగులు జూన్‌లో హై-పేమెంట్ అందుకుంటారు.
3. ప్రపంచమంతా ప్రయాణిస్తూ..
సెప్టెంబర్ నుంచి ఎయిర్‌బీఎన్‌బీ ఉద్యోగులు ఒక సంవత్సరంలో 170 దేశాలలోని ఏదో ఒక ప్రదేశంలో 90 రోజులు నివసిస్తూ పని చేయవచ్చు. వ్యక్తిగత ఉద్యోగులు తమ వర్క్ పర్మిట్లను పొందవలసి ఉంటుంది. అయితే ఎక్కువ మంది వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించడం, పని చేయడం సులభతరం చేయడానికి స్థానిక ప్రభుత్వాలతో కంపెనీ మాట్లాడుతోంది. అయితే, ఈ ఏడాది పర్మనెంట్ ఇంటర్నేషనల్ రీ-లొకేషన్స్ అందుబాటులో ఉండవు.
4. రెగ్యులర్ టీమ్ గ్యాథరింగ్స్, ఆఫ్-సైట్లు, సోషల్ ఈవెంట్స్
ఎయిర్‌బీఎన్‌బీ ఏడాది పొడవునా అర్థవంతమైన భౌతిక సమావేశాలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు కాబట్టి, ఈ సంవత్సరం పరిమిత ఆఫ్-సైట్ ఈవెంట్లు ఉంటాయి. వచ్చే ఏడాది, ఈ ఈవెంట్ల సంఖ్య పెరుగుతుంది.
ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభం.. ఫారిన్ లిక్కర్, విదేశీ టీవీలు సహా ఇవన్నీ బంద్
5. కోఆర్డినేటెడ్గా పని చేయాలి
వర్క్ ఫ్లెక్సిబిలిటీని ఉపయోగించుకునే ఉద్యోగులు వారి ప్రణాళికలను కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇందుకు వర్క్ చక్కగా చేసేందుకు ప్లాన్స్ రూపొందించాలి. ఎలాంటి ప్లాన్ లేకపోతే వర్క్ ఒక పద్ధతిలో పూర్తి చేయడం అసాధ్యమని సీఈఓ బ్రియాన్ చెస్కీ ఈమెయిల్ ద్వారా తెలియజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, International, International news