Air pollution death : వాయు కాలుష్యంతో మరణించిన మొదటి వ్యక్తి ఈ చిన్నారే..

ప్రతీకాత్మక చిత్రం

ఎంతో మంది వాయు కాలుష్యంతో మరణించి ఉండవచ్చు. కానీ వారి మృతికి గల కారణాల్లో ఆస్తమా అనో.. ఊపిరితిత్తుల సమస్య అనో పేర్కొంటారు. కానీ ప్రపంచంలోనే తొలిసారిగా.. యూకే అమ్మాయి డెత్ సర్టిఫికెట్‌లో 'కాజ్ ఆఫ్ డెత్‌'ను వాయు కాలుష్యంగా పేర్కొన్నారు.

  • Share this:
వాయు కాలుష్యం మనుషుల ప్రాణాలకు ప్రమాదంగా మారే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్వాస సంబంధ సమస్యల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బ్రిటన్‌లో వాయుకాలుష్యం వల్లే ఒక వ్యక్తి చనిపోయినట్లు అధికారికంగా ధ్రువీకరించారు. ప్రపంచంలో కాలుష్యం కారణంగా నమోదైన తొలి మరణం ఇదే కావచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది వాయు కాలుష్యంతో మరణించి ఉండవచ్చు. కానీ వారి మృతికి గల కారణాల్లో ఆస్తమా అనో.. ఊపిరితిత్తుల సమస్య అనో పేర్కొంటారు. కానీ ప్రపంచంలోనే తొలిసారిగా.. యూకే అమ్మాయి డెత్ సర్టిఫికెట్‌లో 'కాజ్ ఆఫ్ డెత్‌'ను వాయు కాలుష్యంగా పేర్కొన్నారు.

వాయు కాలుష్యంతో మరణించిన అమ్మాయి పేరు ఎల్లా కిస్సీ డెబ్రా. లండన్‌లో అత్యంత బిజీగా ఉండే లెవిషామ్ ప్రాంతంలో వారి కుటుంబం నివసిస్తోంది. ఆమెకు ఆస్తమా, గుండె సంబంధ అనారోగ్యాలు ఉండేవి. వీటికి చికిత్స తీసుకుంటూ 2013 ఫిబ్రవరిలో ఎల్లా కిస్సీ చనిపోయింది. బాలిక మృతిపై వైద్య అధికారులు చేపట్టిన దర్యాప్తు నివేదికను బుధవారం వెల్లడించారు. శ్వాసకోశ సమస్యలు, తీవ్రమైన ఆస్తమా, వాయు కాలుష్యం వల్లే కిస్సీ చనిపోయిందని అధికారులు తేల్చారు.ప్రపంచంలో మొదటి కేసు
ఎల్లా కిస్సీ వాయుకాలుష్యం వల్ల చనిపోయిందని ఆమె డెత్ సర్టిఫికెట్‌లో అధికారులు రాశారు. ప్రపంచంలో వాయుకాలుష్యం వల్ల ఒక వ్యక్తి చనిపోయినట్లు ఒక దేశం అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి అని ఆస్తమా యుకె (Asthama), బ్రిటిష్ లంగ్ ఫౌండేషన్ (British Lung Foundation) అనే స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. కిస్సీ మరణంపై సౌత్‌వార్క్‌ కరోనర్స్‌ కోర్టులో రెండు వారాలుగా విచారణ జరుగుతోంది. వాయుకాలుష్యం కారణంగా ఆస్తమా తీవ్రత పెరగడం వల్ల కిస్సీ చనిపోయినట్లు వైద్యాధికారి, అసిస్టెంట్ కరోనర్ ఫిలిప్ బార్లో తుది నివేదికలో కోర్టుకు తెలిపారు.

న్యాయం జరిగింది
అనారోగ్య సమస్యలకు ఎల్లా మూడేళ్లపాటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంది. 2010 నుంచి 2013 వరకు ఆమె నైట్రోజన్ డయాక్సైడ్, ఇతర ఉద్గారాల ప్రభావానికి గురైంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ట్రాఫిక్ రద్దీ వల్ల ఉద్గారాలు గాల్లో కలుస్తున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాలకంటే ఎక్కువ కాలుష్యానికి ఎల్లా ప్రభావితమైందని ఫిలిప్ బార్లో చెబుతున్నారు. గాల్లోకి విడుదలయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయులని తగ్గించడానికి ప్రభుత్వాలు చేసిన చట్టాలు కృషిచేయలేకపోయాయని ఆయన తెలిపారు. అధికారుల నివేదిక ద్వారా తమకు న్యాయం జరిగిందని భావిస్తున్నట్లు ఎల్లా కిస్సీ తల్లి రోసముండ్ తెలిపారు. కిస్సీ వంటి ఎంతోమంది పిల్లలు కాలుష్యం ప్రభావానికి గురవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు వాయుకాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరుతున్నారు.

కోర్టులో విచారణ
కిస్సీ ఎల్లా తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యంతో చనిపోయినట్లు 2014లో అధికారులు పేర్కొన్నారు. కానీ ఈ నివేదికను అక్కడి హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలతో వాయుకాలుష్యం కారణంగానే కిస్సీ చనిపోయిందని కోర్టు తెలిపింది. లండన్ మేయర్‌ సాధిక్ ఖాన్‌ దీనిపై స్పందించారు. తన కూతురు చావుకు కాలుష్యమే కారణమని గుర్తించేలా పోరాటం చేసిన రోసముండ్‌ను ఆయన ప్రశంసించారు. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, ప్రాంతాల వారీగా గాలి నాణ్యతను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఇందుకు ప్రత్యేకంగా 3.8 బిలియన్ యూరోలను కేటాయించేదుకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published: