హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Air India : క్యాబిన్ లో కాలిన వాసన..మస్కట్ లో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Air India : క్యాబిన్ లో కాలిన వాసన..మస్కట్ లో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 Air India  flight diverted to Muscat : భార‌త‌్ కు చెందిన విమానాలు త‌రుచూ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంటున్నాయి. షార్జా నుంచి హైద‌రాబాద్ ప్ర‌యాణిస్తున్న‌ ఇండిగో విమానం(Indigo Flight) ఇంజిన్‌లో లోపాలు గుర్తించిన పైల‌ట్లు దాన్ని పాకిస్తాన్ లోనా క‌రాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన గంటల వ్య‌ధిలోనే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్(Air India Express) విమానం సాంకేతిక స‌మ‌స్య‌ను ఎదుర్కొంది.

ఇంకా చదవండి ...

  Air India  flight diverted to Muscat : భార‌త‌్ కు చెందిన విమానాలు త‌రుచూ సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంటున్నాయి. షార్జా నుంచి హైద‌రాబాద్ ప్ర‌యాణిస్తున్న‌ ఇండిగో విమానం(Indigo Flight) ఇంజిన్‌లో లోపాలు గుర్తించిన పైల‌ట్లు దాన్ని పాకిస్తాన్ లోనా క‌రాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన గంటల వ్య‌ధిలోనే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్(Air India Express) విమానం సాంకేతిక స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. గత రాత్రి కేరళలోని కాలికట్ నుంచి దుబాయ్ బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం..ఆదివారం మస్కట్‌ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలోని క్యాబిన్‌ లో కాలిన వాస‌న రావ‌డంతో దాన్ని ముందుజాగ్ర‌త్త‌గా ఒమ‌న్‌ లోని మ‌స్క‌ట్‌(Muscat)కు మ‌ళ్లించారు. ప్రయాణికులంద‌రూ క్షేమంగా ఉన్న‌ట్లు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (DGCA) తెలిపింది. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు డీజీసీఏ అధికారులు వెల్ల‌డించారు.

  కాగా, భారతీయ విమానయాన సంస్థల అత్యవసర ల్యాండింగ్‌లు,అనేక విమానాల దారి మళ్లింపుల గురించి DGCA అధికారి మాట్లాడుతూ.. "జూలై 16న అడిస్ అబాబా నుండి బ్యాంకాక్‌కి వెళ్లే ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం సాంకేతిక సమస్య కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది. శుక్రవారం, శ్రీలంకకు చెందిన విమానం హైడ్రాలిక్ సమస్య కారణంగా చెన్నై విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయినట్లు తెలిపారు.

  Lucky Zodiac Signs : ఈ రాశుల వారికి అప్పటిదాకా భారీ ధనలాభం..మీది ఉందేమో చూసుకోండి!

  కాగా,ఇవాళ ఉదయం షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తోన్న ఇండిగో విమానం 6E-1406లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ వెంటనే విమానాన్ని కరాచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను హైదరాబాద్‌కు తరలించేందుకు అదనపు విమానాన్ని కరాచీకి పంపుతున్నట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వారాల్లో కరాచీలో దిగిన రెండో భారతీయ విమానయాన సంస్థ ఇది. ఈ నెల ప్రారంభంలో, ఢిల్లీ నుండి దుబాయ్‌కి వెళ్లే స్పైస్‌జెట్ విమానం పాకిస్థాన్ (Pakistan) నగరంలో ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతో షెడ్యూల్ లేకుండా ఆగింది. అప్పుడు.. 138 మంది ప్రయాణికులు తరువాత భారతదేశం నుండి పంపిన ప్రత్యామ్నాయ విమానంలో దుబాయ్‌కి బయలుదేరారు. వరుసగా విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Air India, Flight

  ఉత్తమ కథలు