హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan: ఇస్లామాబాద్‌కు సీల్‌..ఇమ్రాన్ ఖాన్‌ హౌస్ అరెస్ట్!

Pakistan: ఇస్లామాబాద్‌కు సీల్‌..ఇమ్రాన్ ఖాన్‌ హౌస్ అరెస్ట్!

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

Imran Khan House Arrest : పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఛైర్మన్‌, బహిష్కృత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తాజాగా స్థానిక న్యూస్ మీడియా పేర్కొంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Imran Khan House Arrest : పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఛైర్మన్‌, బహిష్కృత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)ను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తాజాగా స్థానిక న్యూస్ మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్‌ (Islamabad)లోని బనిగల నివాసంలో అతన్ని గృహనిర్బంధంలో ఉంచడానికి పాక్ ప్రభుత్వం పోలీసులకు అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. విదేశీ నిధుల కేసుకు సంబంధించి ఖాన్‌ను హౌస్ అరెస్టు చేయడానికి పాక్ పోలీసులు రెడీ అవుతున్నారని మీడియా పేర్కొంది. తారిఖ్ షఫీ, హమీద్ జమాన్, సైఫ్ నియాజీలతో సహా PTI నాయకులను పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాతే ఈ విషయం బయటికి వచ్చింది.

ఉన్నట్టుండి అరెస్ట్ ఎందుకు?

జాతీయ అసెంబ్లీని రద్దు చేసి దేశంలో ఎన్నికలను ప్రకటించేలా ఒత్తిడి చేసేందుకు మరో మెగా నిరసనకు సిద్ధం కావాలని ఇమ్రాన్ ఖాన్ సోమవారం తన పార్టీ కార్యకర్తలను కోరారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాలక సంకీర్ణ ప్రభుత్వాన్ని తొలగించే లక్ష్యంతో ఈ మార్చ్ ఈ వారంలోనే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలోనే “ఆజాదీ మార్చ్” కంటే ముందు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గృహనిర్బంధంలో ఉంచడానికి పాక్‌ గవర్నమెంట్ సమాయత్తమవుతోంది. ప్రభుత్వం మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డినెన్స్ కింద ఖాన్‌ను అదుపులోకి తీసుకోవచ్చని సమాచారం.

Video : రష్యా-క్రిమియాను కలిపే ఏకైక బ్రిడ్జ్ పై భారీ పేలుడు..వీడియో

ఖాన్‌పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ రాణా సనావుల్లా ఆదేశాలు జారీ చేశారని ఒక మీడియా రిపోర్ట్ తెలిపింది. ఈ అరెస్టు నివేదికలపై పీటీఐ నాయకుడు ఫవాద్ హుస్సేన్ చౌదరి స్పందించారు. పాలక ప్రభుత్వం “ఆజాదీ మార్చ్” పట్ల భయాందోళనలకు గురవుతోందని అన్నారు. “ఆజాదీ మార్చ్ ప్రకటన తర్వాత నిన్న షెహబాజ్ షరీఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్, తారిఖ్ షఫీ, హమీద్ జమాన్, సైఫ్ నియాజీలను అరెస్టు చేయడం చూస్తుంటే ప్రభుత్వం భయాందోళనలకు గురవుతున్నట్లు స్పష్టమైంది." అని చౌదరి ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్లాన్ బి అరెస్ట్

ఆజాదీ మార్చ్‌లో భాగంగా ఇమ్రాన్ ఖాన్‌ ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించే ముందు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా/పంజాబ్/ రావత్ టి-క్రాస్‌లో నుంచి రాజధానిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే అతన్ని వెంటనే అరెస్టు చేసేలా ప్రభుత్వం “ప్లాన్ బి” సిద్ధం చేసింది. ఇస్లామాబాద్‌లో నిరసనకారులను అడ్డుకునేందుకు కనీసం 10 డ్రోన్లు, 1,000 కంటైనర్లను కూడా ప్రభుత్వం మోహరించనుంది. అలానే ఇస్లామాబాద్‌ను సీల్‌ చేయనుంది. PTI నిరసనలను నగరంలోకి ప్రవేశించకుండా ఆపడానికి ఈ కంటైనర్లను ప్రధాన రహదారులపై ఉంచనుంది.

మొదటగా, నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడానికి ప్రభుత్వం హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తుంది. దీని కోసం రాజధానిలో కనీసం 10 డ్రోన్‌లను మోహరించినట్లు టాక్. దాదాపు 60,000 టియర్‌గ్యాస్ షెల్స్‌తో పాటు 30,000 రబ్బర్ బుల్లెట్లను కూడా సిద్ధంగా ఉంచుతుంది. మొత్తంగా కవాతును ఆపేందుకు భద్రతా ఏర్పాట్ల కోసం రూ.500 మిలియన్లు వెచ్చించనుంది.

First published:

Tags: Imran khan, Pakistan

ఉత్తమ కథలు