Home /News /international /

AHA MUSK YOU ARE NOT NORMAL AT THE SAME TIME AFFAIR WITH FRIENDS WIFE ELAN WHO SAID SENSATIONAL THINGS UMG GH

Elon Musk Affair: స్నేహితుడి భార్యతో ఎలాన్ మస్క్ అఫైర్..? అసలు నిజం ఏంటో చెప్పేసిన టెస్లా సీఈఓ..!

 ఆహా .. మస్క్ నువ్ మాములోడివి కాదయ్యో.. ఏకంగా స్నేహితుడి భార్యతో అఫైర్..  సంచలన విషయాలు చెప్పిన  ఎలాన్ !

ఆహా .. మస్క్ నువ్ మాములోడివి కాదయ్యో.. ఏకంగా స్నేహితుడి భార్యతో అఫైర్.. సంచలన విషయాలు చెప్పిన ఎలాన్ !

ఎలాన్ మస్క్ గూగుల్ (Google) స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు సెర్గీ బ్రిన్ (Sergey Brin) సతీమణి అయిన నికోల్ షాన‌హ‌న్‌ (Nicole Shanahan)తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఒక రిపోర్ట్ పేర్కొంది. అయితే ఇవన్నీ పిచ్చి రాతలు అని మస్క్ మండిపడ్డారు.

టెస్లా(Tesla) సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే పోయిన వారం ఆయన గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన ఒక నివేదిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ నివేదిక మస్క్ వ్యక్తిగత జీవితం గురించి చేసిన ఆరోపణలు అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశాయి. ఈ మీడియా ఎలాన్ మస్క్ గూగుల్ (Google) స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు సెర్గీ బ్రిన్ (Sergey Brin) సతీమణి అయిన నికోల్ షాన‌హ‌న్‌ (Nicole Shanahan)తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు నివేదించింది. అయితే ఇవన్నీ పిచ్చి రాతలు అని మస్క్ మండిపడ్డారు. ఈ పనికిమాలిన వార్తలో అసలు నిజం లేదని, తనకు, నికోల్ షాన‌హ‌న్‌కు మధ్య ఎలాంటి అఫైర్ లేదని తాజాగా కుండబద్దలు కొట్టారు.

“ఇది మొత్తం పూర్తిగా అబద్ధం. సెర్గీ, నేను క్లోజ్ ఫ్రెండ్స్. గత రాత్రి కలిసి పార్టీలో ఉన్నాం, అంతే! నేను నికోల్‌ను గత మూడేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే చూశాను. ఈ రెండు సమయాల్లోనూ ఆమె పక్కన చాలా మంది ఉన్నారు. మా మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ అంటూ ఏమీ లేదు," అని గత వారం వచ్చిన మీడియా కథనంపై ట్విట్టర్ వేదికగా ఎలాన్ మస్క్ స్పందించారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తాను చాలా ఏళ్లుగా శృంగారంలో కూడా పాల్గొనలేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !సెప్టెంబర్ 2021లో సింగర్ గ్రిమ్స్‌తో ఎలాన్ మస్క్ విడిపోయిన తర్వాత ఈ అఫైర్ ప్రారంభమయిందని ఆ నివేదిక ఆరోపించింది. డిసెంబర్ 2021లో మియామీలో జరిగిన ఆర్ట్ బాసెల్ ఈవెంట్‌లో మస్క్‌, నికోల్ షాన‌హ‌న్‌ మధ్య ఎఫైర్ ప్రారంభమైందని నివేదిక రాసుకొచ్చింది. షానహన్, మస్క్‌ల మధ్య అఫైర్ కారణంగా ఈ బిలియనీర్లు ఇద్దరూ తమ స్నేహాన్ని ముగించుకుని ఉండవచ్చని పేర్కొంది. ఈ విషయం బయట పడిన తర్వాత మస్క్ బ్రిన్ ముందు ఒక మోకాలిపై వంగి మరీ క్షమించమని వేడుకున్నారని.. బ్రిన్ ఆ క్షమాపణను అంగీకరించారని కూడా ఇది నివేదించింది. ఆ అఫైర్ తర్వాత గతంలో లాగా మస్క్‌తో బ్రిన్ మాట్లాడడం లేదని కూడా నిరాధార వ్యాఖ్యలు చేసింది.నిజానికి బ్రిన్, మస్క్ మంచి స్నేహితులు. గతంలో మస్క్ బ్రిన్ ఇంటికి వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2008లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు టెస్లా కోసం బ్రిన్ దాదాపు 5 లక్షల డాలర్లను అందించారు. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని పెంచడానికి ఆపసోపాలు పడుతున్న వేళ వారికి ఈ సహాయం చేశారు. అందుకు కృతజ్ఞతగా టెస్లా మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్పోర్ట్-యుటిలిటీ వాహనాన్ని మస్క్ 2015లో బ్రిన్‌కి గిఫ్ట్‌గా అందజేశారు. నవంబర్ 2021లో మస్క్ తన న్యూరాలింక్‌ సంస్థకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌తో సంబంధం పెట్టుకుని, కవల పిల్లలకు జన్మనిచ్చారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ అతని వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు ఈ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. దీనిపై స్వయంగా మస్కే స్పందించి ఈ వార్తను ఖండించారు.
Published by:Mahesh
First published:

Tags: Elon Musk, Google, Illegal affairs, Tesla Motors

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు