Aggressive Crows: కాకులు అంటే భయపడిపోతున్న ఆ కాలనీ వాసులు.. కాలనీలో దిష్టి బొమ్మలు.. ఇంతకీ అవి ఏం చేశాయంటే..

ప్రతీకాత్మక చిత్రం(Image-shutterstock)

మాములుగా కాలనీల్లో జనాలు కుక్కలు, కోతులు వంటి వాటిని చూసి భయపడుతుంటారు. కానీ ఓ ప్రాంత వాసులు రెండు కాకులు అంటేనే ఆందోళన చెందుతుననారు.

  • Share this:
    మాములుగా కాలనీల్లో జనాలు కుక్కలు, కోతులు వంటి వాటిని చూసి భయపడుతుంటారు. కానీ ఓ ప్రాంత వాసులు రెండు కాకులు చేస్తున్న పనికి ఆందోళన చెందుతున్నారు. వాటి పేరు చెబితేనే భయపడిపోతున్నారు. వాటిని అడ్డుకోవడానికి చాలా రకాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన యూకేలోని లిటిల్ ఓవర్, కార్లిస్లే అవెన్యూ ప్రాంతాల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఈ ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా బయట పార్క్ చేసిన వాహనాలపై గీతలు పడటం, వైపర్లు పాడవటం జరుగుతుంది. అయితే తొలుత వారంతా ఇది ఏవరో అకతాయిలు చేస్తున్న పని అని భావించారు. ఇలా విధ్వంసపు చర్యలకు ఎవరూ పాల్పడుతున్నారో తెలుసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే వారికి ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలిసింది. ఈ పని చేస్తున్నది మనుషులు కాదని.. కాకులు ఈ చర్యకు పాల్పడుతున్నాయని తేలింది.

    రెండు కాకులు ఆ ప్రాంతంలోనే తిరుగుతూ కార్లపై అద్దాలను పాడుచేయడం, వైపర్లను విచ్ఛిన్నం చేయడం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మనుషులపై దాడి చేస్తున్నారు. కాకులు చేస్తున్న పని వల్ల ఒకే నెలలో తాను రెండుసార్లు కారు అద్దాలను, వైపర్లను మార్చానని జూలీ బానిస్టర్ అనే ఆవేదన వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి నష్టం జరగకుండా చూసేందుకు.. కారు అద్దాలను కవర్స్‌తో కప్పి ఉంచుతున్నట్టు చెప్పుకొచ్చింది.

    ఈ క్రమంలోనే తమకు నష్టం చేకూరుస్తున్న కాకులకు కొన్ని దశకాల కిందట తూర్పులండన్‌లో అండర్‌ వరల్డ్‌ డాన్‌లుగా పేరుపొందిన రోనీ, రెగీ పేర్లు పెట్టారు. కొందరైతే ఆ కాకులు భయపడాలని పొలాల్లో ఉంచే దిష్టిబొమ్మలను తీసుకొచ్చి.. తమ కార్ల ముందు పెట్టుకున్నారు. అయినప్పటికీ కాకులు ఏ మాత్రం బెదరడం లేదు. దీంతో విసిగిపోయిన స్థానికులు డెర్బీషైర్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    కాకులు బీభత్సంపై రాయల్‌ సొసైటీ ఫర్‌ ది ప్రొటెక్షన్‌ ఆఫ్‌ బర్డ్స్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కాకులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదని తెలిపారు. ఆ కాకులు కార్ల అద్దాలలో తమ ప్రతిబింబం చూసుకొని అవతలి వైపు మరోక పక్షి ఉందేమో.. అని భ్రమపడి ఉండే అవకావం ఉందన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published: