హోమ్ /వార్తలు /international /

Killer Machine: ఇండియన్ ఆర్మీకి లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు.. ఆఫర్ చేయనున్న ఫ్రాన్స్..

Killer Machine: ఇండియన్ ఆర్మీకి లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు.. ఆఫర్ చేయనున్న ఫ్రాన్స్..

నెక్స్‌టర్ తయారుచేసిన 'కిల్లర్ మెషిన్' - లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకులను భారతదేశానికి అందించేందుకు తాజాగా ఫ్రాన్స్ సిద్ధమయ్యింది. ఈ కిల్లర్ మెషిన్ యుద్ధ ట్యాంకులు భారత్ వాడుతున్న ఓల్డ్ T-72M/M1 అజేయా (Ajeya) మెయిన్ బ్యాటిల్‌ ట్యాంకులను భర్తీ చేయనున్నాయి.

నెక్స్‌టర్ తయారుచేసిన 'కిల్లర్ మెషిన్' - లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకులను భారతదేశానికి అందించేందుకు తాజాగా ఫ్రాన్స్ సిద్ధమయ్యింది. ఈ కిల్లర్ మెషిన్ యుద్ధ ట్యాంకులు భారత్ వాడుతున్న ఓల్డ్ T-72M/M1 అజేయా (Ajeya) మెయిన్ బ్యాటిల్‌ ట్యాంకులను భర్తీ చేయనున్నాయి.

నెక్స్‌టర్ తయారుచేసిన 'కిల్లర్ మెషిన్' - లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకులను భారతదేశానికి అందించేందుకు తాజాగా ఫ్రాన్స్ సిద్ధమయ్యింది. ఈ కిల్లర్ మెషిన్ యుద్ధ ట్యాంకులు భారత్ వాడుతున్న ఓల్డ్ T-72M/M1 అజేయా (Ajeya) మెయిన్ బ్యాటిల్‌ ట్యాంకులను భర్తీ చేయనున్నాయి.

ఇంకా చదవండి ...

  దేశభద్రతే (Security) పరమావధిగా భారత సైన్య సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గగనతలంలో శత్రు సేనల క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు యుద్ధ భూమిపై కూడా శత్రువుల ట్యాంకులను తుదముట్టించేందుకు అధునాతనమైన యుద్ధ ట్యాంకులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్ (FRCV) ప్రోగ్రామ్(Programme) కింద భారత సైన్యానికి దాదాపు 1,770 కొత్త ట్యాంకుల సరఫరా కోసం ఆర్ఎఫ్ఐలు జారీ చేసింది కేంద్ర రక్షణ శాఖ. రిక్వెస్ట్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ (RFI) పొందిన 12 ప్రధాన యుద్ధ ట్యాంకుల సరఫరా కంపెనీల్లో నెక్స్‌టర్ (Nexter) కూడా ఒకటి. అయితే నెక్స్‌టర్ తయారుచేసిన 'కిల్లర్ మెషిన్(Killer Machine)' - లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్(leclerc-main-battle) ట్యాంకులను భారతదేశానికి అందించేందుకు తాజాగా ఫ్రాన్స్ సిద్ధమయ్యింది. ఈ కిల్లర్ మెషిన్ యుద్ధ ట్యాంకులు భారత్ వాడుతున్న ఓల్డ్ T-72M/M1 అజేయా (Ajeya) మెయిన్ బ్యాటిల్‌ ట్యాంకులను భర్తీ చేయనున్నాయి. ఈ పాత ట్యాంకులను సోవియట్ యూనియన్ డిజైన్ చేసింది.

  Cars Set Ablaze: న్యూ ఇయర్ వేడుక మామూలుగా లేదుగా.. 874 కార్లను దహనం చేసేశారు.. ఎక్కడంటే..

  లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్..

  లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ (ఎంబీటీ) అనేది ఫ్రెంచ్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయుధ తయారీదారు అయిన నెక్స్‌టర్ సిస్టమ్స్ సహకారంతో ఉత్పత్తి చేసిన 55-టన్నుల ట్రాక్డ్ మెషిన్. అధునాతన వెస్టర్న్ ట్యాంకులతో పోలిస్తే ఇది ఐదు టన్నుల కంటే బరువు తక్కువ. ఇది 1,500 hp ఇంజన్‌తో బాణం, ఎక్స్‌ప్లోజివ్‌, డబ్బా మందుగుండు సామగ్రిని ఫైర్ చేయగలదు. ఇందులోని తుపాకీ నిమిషానికి 12 రౌండ్లు కాల్చగలదని.. ఇది ఆర్మర్-పియర్సింగ్ ఫిన్-స్టెబిలైజ్డ్ డిస్కార్డింగ్ సాబోట్‌(APFSD)ను ఉపయోగిస్తుందని నివేదికలు వెల్లడించాయి.

  లెక్లెర్క్ యుద్ధ ట్యాంకు ఆటోమేటెడ్ లోడింగ్ సిస్టమ్ సాయంతో కదిలే లక్ష్యాల్ని పేల్చగలదు. ఇందులో అదనంగా రూఫ్-మౌంటెడ్ 7.62mm యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ గన్.. 12.7mm మెషిన్ గన్‌ ఉంటుంది. 12.7mm మెషిన్ గన్‌ మెయిన్ ఆయుధంతో ఉమ్మడి ఆక్సిస్ షేర్ చేసుకుంటుంది. లెక్లెర్క్‌లో ఫైండర్స్ (ఫాస్ట్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్, డెసిషన్, రిపోర్టింగ్ సిస్టమ్) అనే బ్యాటిల్‌ఫీల్డ్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్ ను కూడా ఇన్‌స్టాల్ చేశారు. లెక్లెర్క్ మెయిన్ బ్యాటిల్ ట్యాంకు(MBT)లను ప్రామాణిక లెక్లెర్క్ XLRకి ఆధునీకరించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫ్రెంచ్ సైన్యం. మాడ్యులర్ ఆర్మర్ ప్యాకేజీ, న్యూ కాంబాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రేడియోలు, జామర్‌లు, రిమోట్‌గా పనిచేసే మెషిన్ గన్‌ని లెక్లెర్క్ ట్యాంకులో అమర్చారు.

  అప్పుడు రఫేల్ ఇప్పుడు లెక్లెర్క్ ట్యాంకులు..?

  భారత్ & ఫ్రాన్స్ తమ రక్షణ భాగస్వామ్యాన్ని స్థిరంగా పటిష్టం చేసుకుంటున్నాయి. రక్షణ రంగంలో భారతదేశం ఎంచుకున్న స్వావలంబన, స్వయం సమృద్ధి (Self-reliance)కి మద్దతు ఇవ్వడానికి ఫ్రాన్స్ పూర్తి నిబద్ధత కనబరుస్తోంది. ఇటీవలే ఫ్రాన్స్ అందించిన ఫ్రెంచ్ రఫేల్ మల్టీ-రోల్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం ప్రవేశపెట్టింది.

  మాలెగావ్ డాక్‌యార్డ్‌లో ఆరు స్కార్పెన్ జలాంతర్గాములను నిర్మించడానికి కూడా ఒక ఫ్రెంచ్ సంస్థతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు, వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద భారతదేశంలో సైనిక ఇంజిన్‌ను తయారు చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. దీంతో ఈ రెండు దేశాలు రక్షణ రంగ ఉత్పత్తులకు ఒకే పథంలో అడుగులు వేస్తున్నట్లు అవుతుంది.

  భారత్‌తో సంబంధాలను పెంచుకోడానికి ఆకుస్ యే కారణమా..?

  ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మధ్య త్రైపాక్షిక భద్రతా ఒప్పందమే ఈ ఆకుస్. అయితే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా AUKUS కూటమిపై ఫ్రాన్స్ విరుచుకుపడింది. యూఎస్ & యూకే దేశాలు AUKUS కింద అణుశక్తితో నడిచే జలాంతర్గాములను అభివృద్ధి చేయడంలో ఆస్ట్రేలియాకు సహాయపడుతున్నాయి.

  Noise Colorfit Ultra 2: మార్కెట్​లోకి నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 స్మార్ట్​వాచ్ లాంచ్​.. 60 స్పోర్ట్స్​ మోడ్​ల్స్..

  దీంతో 12 సాంప్రదాయిక సబ్ మెరైన్స్ కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో పెట్టుకున్న ఒక ఒప్పందాన్ని కూడా ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. AUKUS & డీల్ రద్దు చేయడాన్ని వెన్నుపోటు చర్యగా ఫ్రాన్స్ పేర్కొంది. ఆకుస్ భద్రతా కూటమిలో చోటు దక్కకపోగా.. ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని కోల్పోయింది ఫ్రాన్స్. ఈ వెన్నుపోటు తర్వాత ఫ్రాన్స్ ఆసియాతో సంబంధాలను మరింతగా పెంచుకుంటుంది. ఇందులో భాగంగా భారత్ తో కూడా ఫ్రాన్స్‌ బంధాలను బలోపేతం చేసుకుంటోంది.

  First published:

  ఉత్తమ కథలు