ప్రధాని మోదీ ప్రసంగానికి ప్రశంసలు... అంతర్జాతీయంగా పెరిగిన భారత్ ఖ్యాతి

PM Modi US Tour : భారత్ లాంటి పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ... తన వారం రోజుల అమెరికా పర్యటనలో... ప్రతిచోటా... భారత దేశ ప్రజల అభిప్రాయాల్నీ, ఆశయాల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. కాలుష్యం, ఉగ్రవాదం అంతు చూడాలనీ, శాంతి మార్గాన్ని అనుసరించాలనీ కోరడంపై ప్రపంచ దేశాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 28, 2019, 12:31 PM IST
ప్రధాని మోదీ ప్రసంగానికి ప్రశంసలు... అంతర్జాతీయంగా పెరిగిన భారత్ ఖ్యాతి
ఐరాసలో ప్రధాని మోదీ (File: AP Photo/Seth Wenig)
Krishna Kumar N | news18-telugu
Updated: September 28, 2019, 12:31 PM IST
PM Modi US Tour : ఇన్నాళ్లూ జీ20, జీ4 గ్రూపుల్లో సంపన్న దేశాలు చెప్పే అంశాల్ని, చేసే ఆదేశాల్నీ భారత్ సహా ప్రపంచ దేశాలు పాటించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. భారత్ లాంటి దేశాలు అభివృద్ధిలో, ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో ముందడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులూ ప్రపంచ దేశాలను ఇండియావైపు చూసేలా చేస్తున్నాయి. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ... అంతర్జాతీయంగా ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. చాలా దేశాల్ని చుట్టేస్తూ... సత్సంబంధాలు నెలకొల్పుతున్నారు. అమెరికా, చైనా, రష్యా లాంటి పెద్ద దేశాలతో ఆయన చేస్తున్న దౌత్యం, స్నేహం సత్ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా హౌడీ మోదీ సభ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు, ఐరాస భద్రతామండలి 74వ సదస్సులో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలకు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పర్యటనతో భారత ఖ్యాతి మరింత ఇనుమడిస్తోంది.




ఐరాస భద్రతా మండలిలో ప్రధాని మోదీ ప్రసంగం ముగియగానే... గ్రీస్, మారిషస్, సింగపూర్ ఇలా చాలా దేశాల అధినేతలు... మోదీని మెచ్చుకున్నారు. ఇక ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రపంచ దేశాలకు నచ్చాలనో, అవి మెచ్చాలనో ప్రధాని తన ప్రసంగాల్లో ఎలాంటి రాజీలూ పడలేదు. కాశ్మీర్ అంశంలో భారత్ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. 130 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నట్లు కాశ్మీర్‌ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు.
Loading...


ఐరాస సాధారణ సదస్సులో కూడా మోదీ బలమైన వాదన వినిపించారు. వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఉగ్రవాదంపై పోరు అంశాల్లో భారత్ తీసుకుంటున్న చర్యల్ని ఆయన ప్రపంచదేశాలకు వివరించారు. తద్వారా ప్రపంచదేశాలకు ఇండియా పట్ల సానుకూల అభిప్రాయం కలిగేందుకు కృషిచేశారు. అందువల్లే గాంధీజీ 150వ పుట్టిన రోజు (అక్టోబర్ 2న)కు గుర్తుగా ముందస్తుగా జరిపిన 150 మొక్కలు నాటే కార్యక్రమంలో సింగపూర్, భూటాన్, న్యూజిలాండ్, జమైకా, బంగ్లాదేశ్ తదితర దేశాల అధినేతలు లేదా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.


అమెరికా పర్యటనలో మోదీ... పసిఫిక్ ఐలాండ్ దేశాలు, కరీబియన్ దేశాలు, భూటాన్, బంగ్లాదేశ్ అధినేతలతో భేటీ అయ్యారు. అమెరికా, ఎస్తోనియా, న్యూజిలాండ్, ఇరాన్ దేశాలతో వేర్వేరు అంశాలపై చర్చించారు. ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్ దేశాల అధినేతలతో మాట్లాడారు. టర్కీ మాత్రం పాకిస్థాన్ వైపు మొగ్గు చూపింది. పెద్దన్నగా వ్యవహరించే అమెరికా... పూర్తిగా ప్రధాని మోదీ, ఇండియాకి సపోర్ట్‌గా నిలిచింది. మొత్తంగా ఇండియాకి ప్రధాని మోదీ టూర్ ఎంతగానో కలిసొస్తోంది. ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
First published: September 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...