Russia Ukraine War news | రష్యా (Russia) , ఉక్రెయిన్ (Ukraine) మధ్య యుద్ధం ఆరని రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. తాజాగా డాన్‌బాస్‌లో (Russia attack on Donbas) రష్యా దాడులు ప్రారంభించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Ukraine President Zelensky) ధ్రువీకరించారు. మురోవైపు ఇప్పటికే రష్యా తూర్పు ఉక్రెయిన్ పట్టణం క్రెమిన్నాను స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే తీవ్రమైన బాంబు దాడులు జరుగుతున్నట్లు డాన్‌బాస్‌లోని ఉక్రెయిన్ బలగాలు చెబుతున్నాయి. ఉత్తరం, దక్షిణం నుంచి ఉక్రెయిన్ దళాలను చుట్టుముట్టడం రష్యా ప్రణాళికగా పేర్కొన్నారు మాజీ NATOఅధికారి రాబర్ట్ బెల్. మే 9న పుతిన్ విజయోత్సవ ప్రసంగానికి ముందు ఉక్రెయిన్ బలగాలను డాన్బాస్ నుంచి తరిమికొట్టి కీలక విజయాన్ని సాధించాలని రష్యా భావిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డాన్‌బాస్‌లో రష్యా సైనికుల ఆపరేషన్ సాఫీగా ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డాన్‌బాస్‌లో యద్ధం రష్యాకు ఎందుకు తేలిక కాదు?
చాలా రోజుల నుంచి యుద్ధం జరుగుతుండడంతో రష్యన్ సైన్యం క్షీణించిందని, తక్కువ నైతికతతో పోరాడుతోందని నిపుణుల అభిప్రాయం పడుతున్నారు. అలాగే, రష్యా దళాలు లాజిస్టిక్ సమస్యలతో సతమతమవుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా సైనికులు, సామగ్రి నిల్వలు గణనీయంగా దెబ్బతిన్నాయి. దాడి ప్రారంభమైనప్పటి నుంచి రష్యా 510 ట్యాంకులు, 2,000 కంటే ఎక్కువ ఇతర సాయుధ వాహనాలు, 4 నౌకలను కోల్పోయినట్టు యుద్ధాన్ని ముందు నుంచి ఫాలో అవుతున్నారు అంచనా వేస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం ఉక్రెయిన్ ఆకస్మిక దాడులు, డ్రోన్ దాడులలో ధ్వంసమైనట్లు సమాచారం.
రష్యాకు చెందిన మిసైల్ క్రూయిజర్ మోస్క్వా మునిగిపోవడంతో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇంతలో వెస్ట్ ఆఫ్ ది లైన్ ఆఫ్ కాంట్రాక్ట్ వద్ద వేర్పాటువాద శక్తులతో కలిసి ఉక్రెయిన్ దళాలు బలపడ్డాయి. దీని ద్వారా డిఫెన్స్‌లో ఉన్న ఉక్రెయిన్‌కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న NATO మాజీ అధికారి వాదన. దాడి చేసేవారికి సంప్రదాయంగా డిఫెండర్లపై 3:1 నిష్పత్తి ఉంటేనే విజయవంతంగా ముందుకు సాగగలరని నిపుణుల అభిప్రాయం. ఇక డాన్‌బాస్‌లో యుద్దానికి 20,000ల మంది సైనికులను ఉక్రెయిన్ సిద్ధం చేసింది. మిత్రదేశాల నుంచి వాయు రక్షణ వ్యవస్థలు, యాంటి ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, మందుగుండు సామగ్రిని అందుకొంది ఉక్రెయిన్.
ఉక్రెయిన్‌కు నాటో మద్దతు
రెండో ప్రపంచ యుద్ధంలో కుర్స్క్ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద ట్యాంక్ యుద్ధానికి డాన్బాస్ సాక్ష్యమవుతుందంటున్న నిపుణులు చెబుతున్నారు. తూర్పున యాంత్రిక యుద్ధతంత్రాలపై ఉక్రెయిన్ దృష్టి సారించడంతో రష్యా ఫ్లాట్, ఓపెన్ భూభాగాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఉక్రెయిన్ కోసం కొత్తగా 800 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీ ప్రకటించింది అమెరికా. కొత్త యూఎస్షిప్మెంట్లో సాయుధ సిబ్బంది క్యారియర్లు, హెలికాప్టర్లు, భారీ ఆయుధాలు ఉన్నాయి.
వ్లాదిమిర్ పుతిన్‌కు డాన్బాస్ ప్రాంతంలో ఏదో ఒక రకమైన సైనిక విజయం చాలా కీలకం. తూర్పులో సైనిక విజయంతో పుతిన్‌కు యుద్ధం నుంచి చెప్పుకోదగిన మార్గంలో నిష్క్రమించేందుకు మార్గం దొరుకుతుందంటున్నారు నిపుణులు. అయినప్పటికీ సుదీర్ఘమైన యుద్ధంలో తక్కువ శిక్షణ పొందిన దళాలను ఎక్కువగా వినియోగించే పరిస్థితిలో రష్యా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine