Home /News /international /

Koo app: ట్విటర్ వద్దు.. 'కూ' ముద్దు.. భారత యాప్‌కు నైజీరియా నీరాజనం

Koo app: ట్విటర్ వద్దు.. 'కూ' ముద్దు.. భారత యాప్‌కు నైజీరియా నీరాజనం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Koo APP: ట్విట్టర్‌ను నైజీరియా నిషేధించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. నైజీరియా సరైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు.

ట్విట్టర్‌కు పోటీగా మన దేశంలో కొన్ని నెలల క్రితం ‘కూ’ అనే యాప్‌ వచ్చింది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ట్విటర్‌లో ఉన్న ప్రాథమిక అంశాలు ఇందులో ఉన్నాయి. వచ్చిన తొలినాళ్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ యాప్... ప్రస్తుతం జోరు మీదుంది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ‘కూ’ను ప్రోత్సహిస్తుండటమే. దీంతో చాలామంది ఈ ప్లాట్‌ఫాంలో చేరుతున్నారు. అయితే నైజీరియా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఈ యాప్‌కు కలిసివచ్చింది. నైజీరియా ప్రభుత్వం ఇటీవల ట్విట్టర్‌ను నిషేధించి, ‘కూ’లోకి వచ్చేసింది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో, దాని వల్ల ‘కూ’కు కలిగే ఉపయోగం ఏంటో చూద్దాం!

‘కూ’ యాప్‌ సీఈవోగా మన దేశానికి చెందిన అప్రమేయ రాధాకృష్ణ ఉన్నారు. ఆయన దీనికి కో ఫౌండర్‌ కూడా. ఇప్పుడు ఈ యాప్‌ మన దేశంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే ట్విట్టర్‌ను నిషేధించాలని నైజీరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే, అక్కడి పాలకుల మదిలో ముందుగా మెదిలింది ‘కూ’నే. నైజీరియా అధ్యక్షుడు చేసిన ఓ ట్వీట్‌ను ట్విట్టర్ ఇటీవల డిలీట్‌ చేసింది. అక్కడ మొదలైన వివాదం, ట్విట్టర్‌ను నిషేధించే వరకు వెళ్లింది.

ట్విట్టర్‌ను నైజీరియాలో నిషేధించడాన్ని అక్కడి ప్రజల్లో కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది వాక్‌ స్వతంత్య్ర హక్కును కాలరాయడమే అని విమర్శిస్తున్నాయి. మరోవైపు ట్విట్టర్‌ కూడా అదే విధంగా స్పందించింది. ఈ ఓపెన్‌ ఇంటర్నెట్‌ యుగంలో ఏ యాప్‌/సర్వీసు వాడాలో ప్రభుత్వం నియంత్రించడం పద్ధతి కాదని వాదిస్తోంది. అయితే నైజీరియా మళ్లీ మా సేవలు అందేలా చర్చలు జరుపుతాం, చర్చలు చేపడతామని చెప్పింది.

మరోవైపు ట్విట్టర్‌ను నైజీరియా నిషేధించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. నైజీరియా సరైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఆయన అలా మాట్లాడటానికి కారణం వేరే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్‌ చాలా రోజుల క్రితమే మూసేసిన విషయం తెలిసిందే. ఇక మన దేశంలో పరిస్థితి చూస్తే ట్విట్టర్‌ - ప్రభుత్వం మధ్య చాలా రోజుల నుంచి చర్చలు నడుస్తున్నాయి.

కొన్ని అభ్యంతరకర ట్వీట్లు, ఖాతాలను తొలగించాలని కేంద్రం... ట్విట్టర్‌ను కోరుతోంది. అయితే దీన్ని ఆ సంస్థ వ్యతిరేకిస్తోంది. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్‌ను పాటించాల్సిందే అని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రెండు వర్గాల మధ్య చర్చలు, విమర్శలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో నైజీరియాలో ట్విట్టర్‌ను నిషేధించి ‘కూ’ను తీసుకోవడంతో, మన దేశంలోనూ ఇలాంటి పరిస్థితి వస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ‘కూ’ పంట పండినట్లే.
;
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Koo App, Nigeria, Social Media, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు