ఎలుకకు అరుదైన గౌరవం.. ల్యాండ్ మైన్ల గుర్తింపుతో గోల్డ్ మెడల్‌తో సత్కారం

మనుషులు కూడా చేయలేని పనిని ఒక ఎలుక చేసి అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ఆఫ్రికాలోని ‘మగావా’ అనే ఎజియంట్ ఎలుక కంబోడియాలో అనేక ల్యాండ్ మైన్లను మరియు పేలుడు పేలుడు పదార్థాలను గుర్తించినందుకు గాను బ్రిటిష్ వెటర్నరీ ఛారిటీ పీపుల్స్ డిస్పోన్సరీ ఫర్ సిక్ యానిమల్స్(పిడిఎస్ఎ) గోల్డ్ మెడల్ అవార్డును అందించింది.

news18-telugu
Updated: September 26, 2020, 5:20 PM IST
ఎలుకకు అరుదైన గౌరవం.. ల్యాండ్ మైన్ల గుర్తింపుతో గోల్డ్ మెడల్‌తో సత్కారం
ఫొటో క్రెడిట్-Twitter
  • Share this:
మనుషులు కూడా చేయలేని పనిని ఒక ఎలుక చేసి అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ఆఫ్రికాలోని ‘మగావా’ అనే ఎజియంట్ ఎలుక కంబోడియాలో అనేక ల్యాండ్ మైన్లను మరియు పేలుడు పేలుడు పదార్థాలను గుర్తించినందుకు గాను బ్రిటిష్ వెటర్నరీ ఛారిటీ పీపుల్స్ డిస్పోన్సరీ ఫర్ సిక్ యానిమల్స్(పిడిఎస్ఎ) గోల్డ్ మెడల్ అవార్డును అందించింది. ఇప్పటివరకు ఈ గోల్డ్ మెడల్‌ను 30 జంతువులకు మాత్రమే ఇచ్చారు. అయితే ఈ మెడల్ గెలుచుకున్న మొదటి ఎలుక ‘మగావా’నే కావడం విశేషం. కాగా కొన్ని దశాబ్దాల నుంచి ఆగ్నేసియా దేశాల్లో కొన్ని ల్యాండ్ మైన్ల, పేలుడు పదార్ధాలు బయటపడుతున్నాయి. ఇవి అనేక మంది ప్రజలను పొట్టనపెట్టుకుంటున్నాయి.

దీంతో ల్యాండ్ మైన్లను గుర్తించడానికి ప్రభుత్వం ఈ ఎలుకను రంగంలోకి దింపింది. ఈ ఎలుక తన కెరీర్లో 39 ల్యాండ్ మైన్లను మరియు 28 పేలుడు లేని ఆర్డినెన్స్ వస్తువులను బయటకు తీసి రికార్డు నెలకొల్పింది. కంబోడియా మరియు ల్యాండ్ మైన్ల బారిన పడుతున్న ఇతర ప్రదేశాల నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఎలుక వెలుగులు నింపింది. మగవాకు ల్యాండ్ మైన్లను గుర్తించడానికి APOPO అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఎలుకకు శిక్షణ ఇచ్చింది. ఇది టాంజానియాలో ఉన్న బెల్జియం- రిజిస్టర్డ్ ఛారిటీ సంస్థ.

ఈ సంస్థ 1990 ల నుంచి వివిధ ఎలుకలను పెంచుతోంది. ల్యాండ్ మైన్లను గుర్తించడానికి ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి ‘హీరో రాట్స్’గా తయారు చేస్తుంది. ఈ సంస్థ పేర్కొన్న దాని ప్రకారం, ఈ ఎలుక 20 ఫుట్బాల్ మైదానాలకు (141,000 చదరపు మీటర్లు) సమానమైన భూభాగంలో బాంబును తనిఖీ చేయడానికి కేవలం 30 నిమిషాల సమయం పడుతుంది. అదే, భూభాగంలో బాంబును కనిపెట్టాలంటే మానవులకు దాదాపు నాలుగు రోజుల సమయం పడుతుంది. పిడిఎస్ఎ యొక్క 77 సంవత్సరాల చరిత్రలో ఒక ఎలుక అటువంటి అవార్డును గెలుచుకోవడం ఇదే మొదటిసారి.

దశాబ్దాలుగా జరిగిన యుద్దాల వల్లే!
ల్యాండ్మైన్లు మరియు యుద్ధ పేలుడు అవశేషాలు కంబోడియన్ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కంబోడియాన్ మైన్ విక్టిమ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ రికార్డు చేసిన సమాచారం ప్రకారం 1979 నుండి ఇప్పటివరకు 19,684 మంది మరణించినట్లు పేర్కొంది. 1970ల ఖైమర్ రూజ్ “కిల్లింగ్ ఫీల్డ్స్” మారణహోమంతో సహా దశాబ్దాలుగా జరిగిన యుద్ధం కారణంగా కంబోడియా ఇప్పటికీ ల్యాండ్మైన్లతో నిండి ఉంది. అంగోలా, మొజాంబిక్, థాయ్లాండ్, లావోస్ మరియు వియత్నాంతో సహా పలు దేశాల్లో మైన్ క్లియరింగ్ ప్రాజెక్టుల కోసం APOPO ఎలుకలను ఉపయోగించింది. ల్యాండ్మైన్ వల్ల ఎలుకలు ఎటువంటి ప్రమాదానికి లోనుకావు అందువల్ల వాటి వెలికితీతకు ఎలుకలను ఉపయోగిస్తుంది అక్కడి ప్రభుత్వం.
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 5:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading