హోమ్ /వార్తలు /international /

Afghanistan: ఆఫ్గానిస్థాన్ లో ఆందోళనకర పరిస్థితులు.. డబ్బులు లేని బ్యాంకులు.. ప్రజల అవస్థలు

Afghanistan: ఆఫ్గానిస్థాన్ లో ఆందోళనకర పరిస్థితులు.. డబ్బులు లేని బ్యాంకులు.. ప్రజల అవస్థలు

ఆఫ్గానిస్థాన్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. డబ్బుల కోసం ప్రజలకు బ్యంకుల ఎదుట ఆందోళన నిర్వహించడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఆఫ్గానిస్థాన్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. డబ్బుల కోసం ప్రజలకు బ్యంకుల ఎదుట ఆందోళన నిర్వహించడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఆఫ్గానిస్థాన్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. డబ్బుల కోసం ప్రజలకు బ్యంకుల ఎదుట ఆందోళన నిర్వహించడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది.

  తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్(Afghanistan) లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఓ వైపు తాలిబన్ల(Taliban) ఆకృత్యాలు, మరో వైపు ఉగ్రవాదుల భయాల నడుమ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. తాలిబన్ల కింద బతకలేమని భావించిన అనేక మంది దేశాన్ని వీడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కన్నీటిని పెట్టిస్తున్నాయి. నిత్యం వేలాదిగా ప్రజలు దేశం దాటడానికి ఏకైక మార్గం అయిన కాబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు(Kabul Airport) చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే అక్కడి బ్యాంకుల్లో(Banks) డబ్బులు లేకపోవడం మరో ఆందోళనకు కారణమైంది. దాదాపుగా ఆరు నెలల నుంచి వేతనాలు రాక ప్రజలు అక్కడ బ్యాంకుల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. ప్రజలకు కూడా ఏటీఎంల వద్ద డబ్బులను తీసుకోవడానికి బారులు దీరి కనిపిస్తున్నారు. తాజాగా న్యూ కాబుల్ బ్యాంకు ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మూడు నుంచి ఆరునెలల పాటు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు వాపోయారు. తమ వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

  ఇదిలా ఉంటే.. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవని అధికారులు చెబుతున్నారు. ఏటీఎం కేంద్రల్లోనూ క్యాష్ విత్ డ్రాపై అధికారులు నియంత్రణ విధించారు. దీంతో డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ప్రజలు గంటల కొద్దీ బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ఆఫ్గానిస్థాన్ లో తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. అక్కడి నుంచి తమ సిబ్బందిని ఉపసంహరించుకుంది ఆస్ట్రేలియా.

  Afghanistan News: వాటర్ బాటిల్ రూ. 3,000.. మురికి కాలువలో జనాలు.. కాబూల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..

  ఇదిలా ఉంటే.. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులతో మరింత దిగజారాయి. బాంబు పేలుళ్లతో మరింతగా వణుకుతున్నారు అప్గాన్లు. ఎలాగైనా దేశం విడిచి వెళ్లాలన్న ఉద్దేశంతో కాబూల్ ఎయిర్‌పోర్టుకు తరలివెళ్తున్నారు. ఎయిర్‌పోర్టు బయట వేలాది మంది పడిగాపులు కాస్తున్నారు. ఐతే బాంబు పేలుళ్లతో అప్రమత్తమైన తాలిబన్లు(Taliban). విమానాశ్రయం వద్ద భారీ రద్దీని తగ్గించేందుకు రంగంలోకి దిగారు. కాబుల్‌ విమానాశ్రయాన్ని దిగ్బంధించారు.

  Ex-Afghanistan Minister: పాపం.. పరాయి దేశంలో పిజ్జాలు డెలివరీ చేస్తున్న ఆఫ్గనిస్తాన్ మాజీ మంత్రి.. వైరల్ గా మారిన ఫొటోలు..

  ప్రజలు ఎయిర్‌పోర్టుకు వైపునకు రాకుండా అదనపు సిబ్బందిని మోహరిస్తున్నారు. మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లే మూడు ద్వారాలతో పాటు ఇతర ప్రాంతాలను అమెరికా బలగాలు వదలివెళ్లడంతో తాలిబన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అఫ్గాన్‌ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఆయుధాలతో ఎయిర్ పోర్టు సమీపంలో గస్తీ కాస్తున్నారు.

  First published:

  ఉత్తమ కథలు