Home /News /international /

AFGHANISTAN WOMENT ACTIVIST AND THREE WOMEN ARE SHOT DEAD EVK

Afghanistan : ఏం జ‌రుగుతోంది అఫ్గ‌న్‌లో.. న‌లుగురి మ‌హిళ‌ల దారుణ హ‌త్య‌

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Afghanistan : అఫ్గనిస్తాన్‌ (Afghanistan)లో తాలిబన్‌లు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోజు రోజుకు తాలిబ‌న్ల క‌ఠిన చ‌ర్య‌లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయి. తాజాగా అఫ్గన్‌ ఉత్తర నగరమైన మజర్‌ ఈ షరిఫ్‌లో నలుగురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.

ఇంకా చదవండి ...
    అఫ్గనిస్తాన్‌ (Afghanistan)లో తాలిబన్‌లు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోజు రోజుకు తాలిబ‌న్ల క‌ఠిన చ‌ర్య‌లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయి. తాజాగా అఫ్గన్‌ ఉత్తర నగరమైన మజర్‌ ఈ షరిఫ్‌లో నలుగురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ వార్తను అఫ్గన్‌ తాలిబన్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు. వారిద్ద‌రిని అరెస్టు చేశామ‌ని కూడా వారు తెలిపారు. అయితే మహిళా హక్కుల కార్యకర్త ఫ్రోజన్ సఫీ(29)తో సహా నలుగురు మహిళలను గుర్తుతెలియని వ్య క్తులు కాల్చి చంపడం అంత‌ర్జాతీయ స‌మాజం  (International Society) మ‌ళ్లీ అఫ్గ‌నిస్థాన్ వైపు చూసే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

    ఏం జ‌రిగింది..
    రెండో సారి తాలిబ‌న్ల పాల‌న మొద‌ల‌య్యాక‌. ఓ మ‌హిళా హ‌క్కుల కార్య‌క‌ర్త హ‌త్య‌కు గురైంది. ఆమె అక్టోబ‌ర్ 20, 2021న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది. ఆ త‌రువాత జాడ తెలియ‌లేదు. తాగా ఆమె మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఆమె పేరు ఫ్రోజ‌న్ స‌ఫీ. ఆమె ఎకాన‌మిక్స్ లెక్చ‌ర‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

    Covid 19 Cases : పెరుగుతున్న కేసులు.. జ‌ర్మ‌నీ, న్యూజిలాండ్‌లో ఆంక్ష‌లు


    ఆమెను గుర్తు తెలియ‌న వ్య‌క్తులు తుపాకీతో కాల్చి చంపారు. ఆమె మొహం తూటా దెబ్బ‌కు చిన్నా భిన్న‌మైంది. ఆమెను దుస్తుల ద్వారా కుటుంబ స‌భ్యులు గుర్తు ప‌ట్టారు. ఆమె జ‌ర్మ‌నీలో ఆశ్ర‌యం పొందేదుకు ప్ర‌యత్నం చేస్తున్నారు. ఇంత‌లోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మిగ‌తా ముగ్గురుకి కూడా ఈ త‌ర‌హాలోనే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌త‌రువాత తిరిగి రాలేదు.

    ఆహార సంక్షోభంలోకి అఫ్గ‌న్‌..
    తాలిబ‌న్ల (Taliban) తిరుగుబాటు.. ప్ర‌భుత్వ ఏర్పాటుతో అఫ్ఘ‌నిస్తాన్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌డం లేదు. దీంతో ప్రపంచ వ్యా ప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన ఆఫ్ఘ‌నిస్తాన్ డ‌బ్బుల‌ను ఆయా బ్యాంకులు తీసుకొనే హ‌క్కును నిలుపుదల చేశాయి. దీంతో అఫ్ఘ‌న్‌లో ఆర్థిక సంక్షోభం (Financial Crisis) ఏర్ప‌డే ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆహారం, న‌గ‌దు నిల్వ‌లు లేక అఫ్ఘ‌నిస్తాన్ ఆర్థిక, ఆహార‌ సంక్షోభంలో ప‌డింది. దేశీయ బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు పూర్తిగా క్షీణ ద‌శ‌కు చేరుకొన్నాయి. ఏటీఎం (ATM)లో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల‌కు న‌గుద అంద‌డం లేదు.

    విజ్ఞ‌ప్తులు చేస్తున్న తాలిబ‌న్లు..
    అఫ్గానిస్థాన్‌ గత ప్రభుత్వా లు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ (Federal Bank), యూరప్‌ (Europe)లోని అనేక సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచింది. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు స్వా ధీనం చేసుకోవడంతో ఆయా దేశాల ప్రభుత్వా లు ఆ డబ్బును తాలిబన్లు తీసుకోవ‌డానికి వీలు లేకుండా నిలిపేశాయి. అక్క‌డి ప్ర‌భుత్వాన్ని అంత‌ర్జాతీయ స‌మాజం (International Society) గుర్తించేదాకా ఈ నిలుపుద‌ల కొన‌సాగుతుంద‌ని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఇప్ప‌డు ఆర్థిక‌, ఆహార సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని తాలిబన్‌ ప్రభుత్వం ఆయా దేశాల‌ను కోరుతోంది. అంత‌ర్జాతీయ స‌మాజం ఒప్పుకొనేలా అన్ని చ‌ర్య‌లుతీసుకొంటామ‌ని విజ్ఞ‌ప్తులు చేస్తోంది అఫ్గ‌నిస్థాన్‌.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Afghanistan, Murder case, Women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు