AFGHANISTAN WITHOUT FOREIGN AID THE TALIBAN ARE CREATING A NEW BUDGET EVK
Afghanistan: విదేశీ సహాయం లేకుండానే.. కొత్త బడ్జెట్ రూపొందిస్తున్న తాలిబాన్లు
ప్రతీకాత్మక చిత్రం (ఫోటో - రాయిటర్స్)
Afghanistan: తాలిబాన్ (Taliban) ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ఆర్థిక మంత్రిత్వ శాఖ ముసాయిదా జాతీయ బడ్జెట్‌ను సిద్ధం చేసిందని, రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులు సమకూరుస్తున్నట్లు ఒక ప్రతినిధి తెలిపారు.
తాలిబాన్ (Taliban) ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ఆర్థిక మంత్రిత్వ శాఖ ముసాయిదా జాతీయ బడ్జెట్‌ను సిద్ధం చేసిందని, రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులు సమకూరుస్తున్నట్లు ఒక ప్రతినిధి తెలిపారు. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ ముసాయిదా బడ్జెట్ పరిమాణాన్ని వెల్లడించలేదు. బడ్జెట్ తయారీ ప్రక్రియ డిసెంబర్ 2022 వరకు నడుస్తుంది. అయితే ఇది ప్రచురించబడే ముందు ఆమోదం కోసం క్యాబినెట్‌కు వెళుతుందని AFP కి చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షభం (Financial Crisis) లో కూరుకుపోయిన ఆఫ్గనిస్తాన్ ఈ బడ్జెట్ చాలా కీలకం. ఈ నేపేథ్యంలో అహ్మద్ వలీ హక్మల్ పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్య్వూ (Interview) లో ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. దేశీయ ఆదాయం ద్వారా ఆర్థిక సాయాన్ని పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు.
ఆర్థిక లోటు అంచనా..
ఆఫ్ఘనిస్థాన్ 2021 బడ్జెట్, IMF మార్గదర్శకత్వంలో మునుపటి పరిపాలనతో కలిపి, 219 బిలియన్ ఆఫ్ఘనిస్ (ఆ సమయంలో $2.7 బిలియన్లు) సహాయం, గ్రాంట్లు, దేశీయ ఆదాయం నుంచి 217 బిలియన్ల లోటును అంచనా వేసింది. గతంలో డాలర్‌తో మారకం రేటు సుమారు 80 ఆఫ్ఘనిస్గా ఉంది., అయితే తాలిబాన్లు తిరిగి వచ్చినప్పటి నుంచి స్థానిక కరెన్సీ దెబ్బతింది. , ముఖ్యంగా గత వారంలో శుక్రవారం 100కి చేరుకోవడానికి ముందు సోమవారం 130కి పడిపోయింది.
గత రెండున్నర నెలల్లో 26 బిలియన్ల ఆఫ్ఘనిస్లను సేకరించామని ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో 13 బిలియన్ల కస్టమ్స్ డ్యూటీలు ఉన్నాయని కొత్త ప్రభుత్వ రెవెన్యూ విభాగం గత నెలలో తెలిపింది. పేద ప్రజలు, అనాథల కోసం సహాయ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి కొత్త ఇస్లామిక్ పన్నును కూడా ప్రకటించింది.
ఏం జరిగింది...
అఫ్గానిస్థాన్ గత ప్రభుత్వా లు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్ ఫెడరల్ బ్యాంక్ (Fedaral Bank), యూరప్ (Europe)లోని అనేక సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచింది. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వా ధీనం చేసుకోవడంతో ఆయా దేశాల ప్రభుత్వా లు ఆ డబ్బును తాలిబన్లు తీసుకోవడానికి వీలు లేకుండా నిలిపేశాయి. అక్కడి ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం (International Society) గుర్తించేదాకా ఈ నిలుపుదల కొనసాగుతుందని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఇప్పడు ఆర్థిక, ఆహార సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని తాలిబన్ ప్రభుత్వం ఆయా దేశాలను కోరుతోంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.