AFGHANISTAN WILL NOT BE TERRITORY FOR TERRORISM SAYS PM NARENDRA MODI AK
PM Modi: ఆఫ్ఘనిస్థాన్ అలా కాకుండా చూడాలి.. ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు
ప్రధాని మోదీ ప్రసంగం ( Photo: ANI/ Twitter)
Pm Modi: ఆఫ్ఘనిస్థాన్‌పై జీ20 ఎక్స్ట్రార్డినరీ సమ్మిట్‌ను ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆఫ్ఘన్ ప్రజలకు అత్యవసరంగా, నిరంతరాయ మానవతావాద సాయం అందజేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలోని డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్‌ను కూడా అరికట్టడంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌లో మార్పు తీసుకురావడంపై ప్రపంచం మొత్తం ఒక్కటిగా స్పందించాలని అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌పై జీ20 ఎక్స్ట్రార్డినరీ సమ్మిట్‌ను ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆఫ్ఘన్ ప్రజలకు అత్యవసరంగా, నిరంతరాయ మానవతావాద సాయం అందజేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆ దేశంలో సమ్మిళిత ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితిని మెరుగుపరచాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2593కు అనుగుణంగా అంతర్జాతీయ సమాజం స్పందించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు.
భారత్ అధ్యక్షతన ఆగస్టు 30న జరిగిన ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ఓ తీర్మానం ఆమోదం పొందింది. ఆఫ్ఘనిస్థాన్‌లో మానవ హక్కులను సమర్థించవలసిన అవసరం ఉందని ఈ తీర్మానం తెలిపింది. ఆ దేశ గడ్డను ఉగ్రవాదం కోసం ఉపయోగించుకోరాదని డిమాండ్ చేసింది. ప్రస్తుత సంక్షోభానికి చర్చల ద్వారా రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని పిలుపునిచ్చింది.
మరోవైపు ఆకలి, పోషకాహార లోపంతో ఆఫ్ఘన్లు బాధపడుతుండటం పట్ల ప్రతి భారతీయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటలీ అధ్యక్షతన జరుగుతున్న జీ20 దేశాల భేటీకి ఆ దేశ ప్రధాని మారియో డ్రాగీ అధ్యక్షత వహించారు. ఇదిలా ఉంటే తాలిబన్ల వశమైన తరువాత ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు మరింతగా దిగజారాయి. మొదట్లో తాము గతంలో మాదిరిగా కఠినంగా వ్యవహరించబోమని చెప్పిన తాలిబన్లు.. ఆచరణకు వచ్చేసరికి గతంలో అనుసరించిన విధానాలనే మళ్లీ అమలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మహిళల స్వేచ్ఛ విషయంలో తాలిబన్లు గతంలో మాదిరిగానే వివక్ష కొనసాగిస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.