Home /News /international /

Afghanistan: అప్ఘనిస్తాన్​ మరో సంచలన నిర్ణయం.. ఇకపై మహిళల విషయంలో అలా జరగొద్దంటూ ఉత్తర్వులు..

Afghanistan: అప్ఘనిస్తాన్​ మరో సంచలన నిర్ణయం.. ఇకపై మహిళల విషయంలో అలా జరగొద్దంటూ ఉత్తర్వులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అప్ఘనిస్తాన్ (Afghanistan)​. గత కొద్దిరోజులుగా వణికిపోతోంది. తాలిబన్లు (Taliban's) దాడులు చేసి అప్ఘన్​ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం ఓ మంచి  నిర్ణయం తీసుకుంది. 

  అప్ఘనిస్తాన్ (Afghanistan)​. గత కొద్దిరోజులుగా వణికిపోతోంది. తాలిబన్లు (Taliban's) దాడులు చేసి అప్ఘన్​ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాలిబన్లకు భయపడి లక్షలాది మంది దేశం (country) విడిచి ఇతర దేశాలకు (countries) వలసవెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలె తాలిబన్ల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం (new government) ఏర్పాటైంది. అయితే తాలిబాన్లు కొత్త ప్రభుత్వంలో పలు మార్పులకు (changes) శ్రీకారం చుట్టారు. సంస్థలు, నగరాల (cities) పేర్లను మార్చుతున్న తాలిబన్లు ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే పేరు మార్చడానికి కసరత్తు ప్రారంభించారు.  ఇటీవలే  అప్ఘన్లో పాఠశాలలు (schools) ప్రారంభమైనా అక్కడ బాలురు (boys) మాత్రమే చదువుకోవడానికి వెళుతున్నారు. దీంతో తమకూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలని అమ్మాయిలు (girls) డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒకరికొకరు ఫొటోలు, వీడియోలు షేర్​ చేస్తున్నారు. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం ఓ మంచి  నిర్ణయం తీసుకుంది. మహిళల బలవంతపు పెళ్లిళ్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్‌లో​ తాలిబన్‌ పాలకులు ప్రకటించారు.

  పురుషులు, మహిళలు సమానమని..

  వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి (A woman's permission to marry is mandatory) అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. పురుషులు, మహిళలు సమానమని, అతివను ఆస్తి (Not property)గా పరిగణించకూడదంటూ కూడా పేర్కొన్నారు. తాలిబన్‌ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఈ ఉత్తర్వులు (Orders) విడుదలయ్యాయి.

  వితంతు మహిళల విషయంలో..

  అఫ్గాన్‌ గిరిజన తెగల్లో (Tribal tribe) వితంతువులైన మహిళలు.. భర్త అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం (marriage) చేసుకోవాలన్న నియమం ఉంది. ఇలాంటి ఆచారాలన్నింటినీ మార్చేలా తాలిబన్ల తాజా ఉత్తర్వులున్నాయి (Orders). అయితే ఇందుకు భిన్నంగా భర్తను కోల్పోయిన మహిళ, 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తున్నట్టు తాజా ఆదేశాల్లో తాలిబన్లు పేర్కొన్నారు.

  అప్ఘనిస్తాన్ (Afghanistan) . ప్రస్తుతం కరువు, పేదరికం (poverty) వలసలతో సతమతమవుతోంది. అప్ఘన్‌ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఇదివరకే ఐక్యరాజ్య సమితి (United nations) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ వెల్లడించారు. ఉగ్రవాదం (terrorism) పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల (human rights) పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ (world) దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్‌ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అప్ఘన్‌కు సత్వర ఆర్థిక సాయం (financial help) కోరుతూ ఐరాస జెనీవాలో విరాళాల (donations) సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్‌ కోరింది. అయితే తాజాగా అప్ఘనిస్తాన్లో మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రజలకు తినడానికి తిండి కూడా సరిగా దొరకట్లేదని తెలుస్తోంది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Afghanistan, Marriage, Women

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు