తాలిబన్ల (Taliban) తిరుగుబాటు.. ప్రభుత్వ ఏర్పాటుతో అఫ్ఘనిస్తాన్ (Afghanistan) లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడం లేదు. దీంతో ప్రపంచ వ్యా ప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన ఆఫ్ఘనిస్తాన్ డబ్బులను ఆయా బ్యాంకులు తీసుకొనే హక్కును నిలుపుదల చేశాయి. దీంతో అఫ్ఘన్‌లో ఆర్థిక సంక్షోభం (Financial Crisis) ఏర్పడే పరిస్థితులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తాలిబన్‌లు తాము పంథా మార్చుకొన్నామని మహిళల హక్కులు కాపాడతామని పేర్కొన్నారు. బాలికలు విద్యాలయాలకు వెళ్లడానికి అంగీకరిస్తున్నామని తెలిపారు. మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చనే అంశం కూడా ఆమోదయోగ్యమేనని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న దేశాన్నికాపాడాలని కోరారు. అఫ్గాన్ ప్రజల పట్ల ప్రపంచం కనికరం చూపి ఆదుకోవాలని తాలిబన్ విదేశీ వ్య వహారాల మంత్రి అమీర్ఖాన్ ముత్తాఖీ అభ్యర్థించారు. అమెరికాతో తమకు తగవు లేదనీ, ప్రపంచ దేశాలన్నింటితో సత్సంబంధాలు కోరుకుంటున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఆఫ్గనిస్తాన్‌లో పాఠశాలలు నిరంతరం కొనసాగుతున్నాయని తాలిబన్ విదేశీ వ్య వహారాల మంత్రి అమీర్ఖాన్ ముత్తాఖీ వెల్లడించారు.
ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేసిన మహిళలంతా తిరిగి విధులకు హాజరవుతున్నా రనీ వెల్లడించారు. గత ప్రభుత్వ అధికారులకు క్షమాభిక్ష నాలుగు రాష్ట్రాల్లో పూర్వ ప్రభుత్వం కింద పనిచేసిన 100 మంది పోలీసు, నిఘా సం స్థల అధికారులను వధించడమో, అదృశ్యం చేయడమో జరిగిందని గత నెలలో హ్యూ మన్ రైట్స్ వాచ్ అనే అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది. అయితే, పూర్వ ప్రభుత్వ యం త్రాం గం లోని వారం దరిపై తాలిబన్లు ప్రతీకార చర్య కు దిగలేదని, చాలామం దికి క్షమాభిక్ష ప్రకటిం చామని ముత్తాఖీ తెలిపారు. .
ఏం జరిగింది..
అఫ్గానిస్థాన్ గత ప్రభుత్వా లు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్ ఫెడరల్ బ్యాంక్ (Fedaral Bank), యూరప్ (Europe)లోని అనేక సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచింది. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వా ధీనం చేసుకోవడంతో ఆయా దేశాల ప్రభుత్వా లు ఆ డబ్బును తాలిబన్లు తీసుకోవడానికి వీలు లేకుండా నిలిపేశాయి. అక్కడి ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం (International Society) గుర్తించేదాకా ఈ నిలుపుదల కొనసాగుతుందని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఇప్పడు ఆర్థిక, ఆహార సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని తాలిబన్ ప్రభుత్వం ఆయా దేశాలను కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Financial problem