హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Taliban: తాలిబన్లతో చేతులు కలిపిన అల్ ఖైదా.. పంజ్‌షీర్‌‌ ఆక్రమణ ప్రధాన లక్ష్యం.. తరువాత టార్గెట్ కాశ్మీర్ అంటూ ప్రచారం

Taliban: తాలిబన్లతో చేతులు కలిపిన అల్ ఖైదా.. పంజ్‌షీర్‌‌ ఆక్రమణ ప్రధాన లక్ష్యం.. తరువాత టార్గెట్ కాశ్మీర్ అంటూ ప్రచారం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Taliban-alqida: ఆప్ఘన్ లో అరాచకాలతో చెలరేగిపోతున్న తాలిబన్లకు ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా తొోడవుతోంది. ప్రస్తుతానికి పంజ్‌షీర్‌‌ ఆక్రమణ వారి లక్ష్యమైనా.. తరువాత కశ్మీర్ వారి టార్గెట్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

Taliban: ఆప్ఘనిస్థాన్ (Afghanistan) ను సొంతం చేసుకున్న తాలిబన్ల (Taliban) అరచకాల గురించి రోజుకో వార్త వింటున్నాం.. అక్కడ బతకలేక చాలామంది వివిధ దేశాల్లో తలలు దాచుకుంటున్నారు. మహిళలు నిరసనలు చేపడుతున్నారు. అయినా వారి అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పుడు వారికి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా(alqida) తో తాలిబన్లు చేతులు కలిపారు. కంట్లో నలుసులా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసి ఆక్రమించుకునేందుకు తాలిబన్లు అల్ ఖైదాతో జతకట్టారు. పంజ్ షీర్ (Panjshir) ప్రావిన్స్ పై దాడి చేసేందుకు అల్ ఖైదా మిలిటెంట్ యూనిట్లు తాలిబన్లతో కలుస్తున్నారని అఫ్ఘానిస్తాన్ నేషనల్ రెసిస్ టెన్స్ ఫ్రంట్ ప్రతినిధే ప్రకటించారు. శాంతిపూర్వక పరిష్కారానికి ఫ్రంట్ కట్టుబడి ఉంది. అదే సమయంలో తాలిబన్ల నుంచి ఎలాంటి దాడి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని రెసిస్ టెన్స్ అధికార ప్రతినిధి ఫహీమ్ దస్తీ తెలిపారు. రెసిస్ టెన్స్ దళాలు 350మంది తాలిబన్లను హతమార్చిన సంగతి తెలిసిందే. పంజ్ షీర్ ప్రావిన్స్ లోని షుతుల్ జిల్లాను ఆక్రమించుకున్నట్టు తాలిబన్లు చేసిన ప్రకటనను రెసిస్ టెన్స్ దళాలు ఖండించాయి. తాలిబన్లు, పంజ్ షీర్ రెసిస్ టెన్స్ ఫ్రంట్ మధ్య ఘర్షణలపై అఫ్ఘాన్ మాజీ ప్రెసిడెంట్ హమీద్ కర్జాయ్ స్పందించారు. ఇరు దళాలు ఘర్షణలు మాని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

అఫ్ఘానిస్తాన్ లో అస్థిరత పాకిస్తాన్ ను కలవరపెడుతోంది. బోర్డర్ లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. అఫ్ఘాన్ బోర్డర్ లోని పాకిస్తాన్ సెక్యూరిటీ పోస్టులపై గత కొన్ని రోజులుగా దాడులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేకుండా పాకిస్తాన్ లో అడుగుపెడుతున్న అప్ఘాన్ శరణార్దులను పెషావర్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: అక్కడ శృంగారానికి నో చెబుతున్న మహిళలు.. ఎక్కడ... ఎందుకో తెలుసా..?

అఫ్ఘానిస్తాన్ లో రాజధాని కాబూల్ సహా అన్నింటినీ స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. ఆక్రమించేందుకు తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలను పంజ్ షీర్ యోధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇటీవల పంజ్ షీర్ ప్రావిన్స్ లోని ఖవక్ లో జరిగిన హోరాహోరీలో 350 మంది తాలిబన్లు హతమైనట్టు పంజ్ షీర్ పోరాట దళంలోని నార్తర్న్ అలయన్స్ ప్రకటించింది. మరో 40 మందిని బందీలుగా పట్టుకున్నామని వెల్లడించింది.

ఇదీ చదవండి: మనిషిలా మిమిక్రీ చేసే పక్షిని ఎప్పుడైనా చూశారా..? కావాలంటే ఈ వీడియో చూడండి!

పంజ్ షీర్ ను ఆక్రమించేందుకు తాలిబన్లు అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. పంజ్ షీర్ పోరాట దళాలు వాటిని తిప్పికొడుతున్నాయి. గుల్బహర్ లోకి ఎవరూ రాకుండా తాలిబన్లు కంటెయినర్ తో రోడ్డును బ్లాక్ చేశారు. రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇటు కశ్మీర్ పైనా తాలిబన్లను అల్ ఖైదా ఉసిగొల్పుతోంది. ప్రపంచంలోని ముస్లింలు ఉన్న ప్రాంతాలన్నింటికీ ఆయా దేశాల నుంచి స్వేచ్ఛ కల్పించాలంటూ రెచ్చగొడుతోంది. వీరి కలియకు ముందు ముందు ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చూడాలి..

First published:

Tags: Afghanistan, International news, World news

ఉత్తమ కథలు