హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో వాళ్లు ఏమయ్యారు.. అమెరికా, బ్రిటన్ నివేదికలో షాకింగ్ విషయాలు

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో వాళ్లు ఏమయ్యారు.. అమెరికా, బ్రిటన్ నివేదికలో షాకింగ్ విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Afghanistan: ఇటీవల కొందరు తాలిబన్ సైనికులు అమెరికా, బ్రిటన్ సైనికులు వినియోగించే టెక్నిక్‌లను ఫాలో కావడం ఆ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది.

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైంది. అక్కడ తాలిబన్ల ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. తాలిబన్ల రాకతో అక్కడి పాలకులు, ముఖ్యనేతలు ఇతర దేశాలకు పారిపోయారు. అయితే అంతకుముందు ప్రభుత్వంలో పని చేసిన ఆఫ్ఘనిస్థాన్ సైనికులు ఇప్పుడు ఏం చేస్తున్నారనే సందేహాలు తలెత్తాయి. ఈ డౌట్ సామాన్యులకు మాత్రమే కాదు.. అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్‌లకు కూడా వచ్చాయి. అయితే ఇటీవల కొందరు తాలిబన్ సైనికులు అమెరికా, బ్రిటన్ సైనికులు వినియోగించే టెక్నిక్‌లను ఫాలో కావడం ఆ దేశాలకు ఆశ్చర్యం కలిగించింది. ఆ తరువాత వారికి అసలు విషయం తెలిసొచ్చింది. ఆప్ఘనిస్థాన్ తాలిబన్ల సొంతం కావడంతో.. అంతకముందు ఆ దేశ సైన్యంలో పని చేసిన వారిలో పలువురు తాలిబన్లలో చేరిపోయారని ఆ దేశాలు గుర్తించాయి. ఇలాంటి వాళ్లు తాలిబన్లలో చేరడానికి అనేక కారణాలు ఉండొచ్చని ఆ దేశాలు భావిస్తున్నాయి.

1996 నుంచి 2001 మధ్య తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు వారిలో చాలామందికి తాలిబాన్‌లతో పూర్వ సంబంధాలు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీంతో పాటు తమ కుటుంబానికి భద్రత గురించి ఆందోళన చెందుతున్న వారు సైతం తాలిబన్లలో చేరేలా ప్రొత్సహించవచ్చని అంచనా వేస్తున్నారు. కొంతమంది ఆఫ్ఘన్ సైనికులు ఫిరాయించి తాలిబన్లుగా మారినట్టు ఇంటెలిజెన్స్ విశ్లేషకురాలు బార్బరా కెలెమెన్ తెలిపారు. నిజానికి దేశం తమ సొంతమైన తరువాత అక్కడి ప్రజలు, సైనికులకు క్షమాభిక్ష పెడతామని వారు ప్రకటించారు. అయితే చాలా మంది సైనికులు తాలిబన్ల వేధింపులకు భయపడి దేశం విడిచి వెళ్లినట్లు భావిస్తున్నారు. కొందరు రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో చేరడానికి పంజ్‌షీర్‌కు వెళ్లారు. అయితే మరికొందరు మాత్రం మరో మార్గం లేకపోవడంతో.. తాలిబన్ల సైన్యంలో చేరిపోయారు.

KTR: టీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. త్వరలోనే వారికి పదవులు..

kiara advani: కియారా అద్వానీలా ఉన్న యువతి.. అట్రాక్ట్ అవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఎవరామె..

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి ఐక్యరాజ్యసమితి పలు కీలక సూచనలు చేసింది. పరిపాలన విధానంలో యువత, మహిళలకు అవకాశం ఇవ్వకూడదనే తాలిబన్ల ఆలోచన తీరును యూఎన్‌ తీవ్రంగా ఖండించింది. వారి భాగస్వామ్యం లేని పరిపాలన విధానం అర్థరహితమైనదని పేర్కొంది. తాలిబన్లు హింసా ప్రవృత్తి మానుకోవాలని... దేశంలో శాంతి, సుస్థిర సౌభ్రాతత్వం అనేవి సమగ్ర పాలన పైనే ఆధారపడి ఉంటాయని యూఎన్‌ఏఎంఏ స్పష్టం చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత జీవన విధానం అనేవి అఫ్గాన్‌ ప్రజల ప్రాథమిక హక్కులని గుర్తు చేసింది. తిరుగుబాటుదారులు, పాత్రికేయుల పట్ల హింసా ప్రవృత్తిని ప్రదర్శంచకూడదంటూ సూచించింది. ఆఫ్గాన్‌లోని బాలికలు, మహిళలకు అండగ ఉంటామని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారికి పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

First published:

Tags: Afghanistan, Taliban

ఉత్తమ కథలు