Home /News /international /

Afghanistan: ఆఫ్ఘ‌న్‌లో సగం జ‌నాభా ఆహార కొరతతో బాధపడే అవ‌కాశం: పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి

Afghanistan: ఆఫ్ఘ‌న్‌లో సగం జ‌నాభా ఆహార కొరతతో బాధపడే అవ‌కాశం: పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Afghanistan - Pakistan | ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో సగం మంది ఆహార కొరత (Food Crisis) తో బాధపడే అవ‌కాశం ఉంద‌ని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి అన్నారు. ప్ర‌స్తుతం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై శ్రద్ధ చూపకపోతే పెద్ద‌ మానవ విషాదం జరుగుతుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇంకా చదవండి ...
    ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా.. స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయకపోతే ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటుందని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి శనివారం అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో దిగజారుతున్న మానవతా పరిస్థితులపై చర్చించేందుకు డిసెంబర్ 19, 2021న ముస్లిం దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని పాకిస్థాన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (Organization of Islamic cooperation) విదేశాంగ మంత్రుల మండలి 17వ సెషన్ 41 ఏళ్ల తర్వాత జరగనుందని, ఇది ఆఫ్ఘన్ పరిస్థితిలోని ఆవశ్యకతను తెలియజేస్తోందని ఖురేషీ లాహోర్‌లో మీడియాకు తెలిపారు. ప్ర‌స్తుతం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై శ్రద్ధ చూపకపోతే పెద్ద‌ మానవ విషాదం జరుగుతుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో సగం మంది ఆహార కొరతతో బాధపడే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

    ఆఫ్ఘనిస్తాన్ ఆస్తుల విడుదల కోసం వాదిస్తూ..పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్ర‌పంచ దేశాలు స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయకపోతే దేశం ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటుందని ఆయన అన్నారు.

    Instagram Photos: 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు ఇవే..


    తాలిబ‌న్ల (Taliban) తిరుగుబాటు.. ప్ర‌భుత్వ ఏర్పాటుతో అఫ్ఘ‌నిస్తాన్‌ (Afghanistan) లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ప్ర‌పంచ దేశాలు గుర్తించ‌డం లేదు. దీంతో ప్రపంచ వ్యా ప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన ఆఫ్ఘ‌నిస్తాన్ డ‌బ్బుల‌ను ఆయా బ్యాంకులు తీసుకొనే హ‌క్కును నిలుపుదల చేశాయి. దీంతో అఫ్ఘ‌న్‌లో ఆర్థిక సంక్షోభం (Financial Crisis) ఏర్ప‌డే ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే ఆహారం, న‌గ‌దు నిల్వ‌లు లేక అఫ్ఘ‌నిస్తాన్ ఆర్థిక, ఆహార‌ సంక్షోభం (Food Crisis) లో ప‌డింది. దేశీయ బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ‌లు పూర్తిగా క్షీణ ద‌శ‌కు చేరుకొన్నాయి. ఏటీఎం (ATM)లో డ‌బ్బులు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల‌కు న‌గుద అంద‌డం లేదు. క‌నీసం ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు (Salaries) కూడా ఇవ్వ‌లేని స్థితిలోకి ఆఫ్ఘ‌నిస్తాన్ వెళ్తోంది.

    ఏం జ‌రిగింది...
    అఫ్గానిస్థాన్‌ గత ప్రభుత్వా లు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ (Fedaral Bank), యూరప్‌ (Europe)లోని అనేక సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచింది.

    PM CARES: 3,049 మంది కోవిడ్ అనాథ‌ల‌ను సాయం కోసం గుర్తించాం: లోక్‌సభలో ప్రభుత్వం


    ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు స్వా ధీనం చేసుకోవడంతో ఆయా దేశాల ప్రభుత్వా లు ఆ డబ్బును తాలిబన్లు తీసుకోవ‌డానికి వీలు లేకుండా నిలిపేశాయి. అక్క‌డి ప్ర‌భుత్వాన్ని అంత‌ర్జాతీయ స‌మాజం (International Society) గుర్తించేదాకా ఈ నిలుపుద‌ల కొన‌సాగుతుంద‌ని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఇప్ప‌డు ఆర్థిక‌, ఆహార సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని తాలిబన్‌ ప్రభుత్వం ఆయా దేశాల‌ను కోరుతోంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Afghanistan, Financial problem, Food, Pakistan

    తదుపరి వార్తలు