Home /News /international /

AFGHANISTAN NEWS UPDATES PRESIDENT ASHRAF GHANI RESIGNS V P SALEH TO LEAVE KABUL SK

Afghanistan: ఆప్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రప్ ఘనీ రాజీనామా.. తాలిబన్లకు అధికారం అప్పగింత

అష్రఫ్ ఘనీ

అష్రఫ్ ఘనీ

Ashraf Ghani Resign: అధ్యక్ష భవనంలో చర్చల అనంతరం అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాబూల్‌ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఐతే ఎక్కడికి వెళ్లారన్న వివరాలు మాత్రం తెలియలేదు.

ఇంకా చదవండి ...
    ఆఫ్ఘానిస్తాన్‌లో పరిణామాలు శరవేగంగా వేగంగా మారిపోతున్నాయి. ఆదివారం దేశరాజధాని కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో... ఆఫ్ఘాన్ ప్రభుత్వం లొంగిపోయింది. తాలిబన్లతో పోరాడలేక చేతులెత్తేసింది. కాబూల్‌లో హింసను నివారించేందుకు, శాంతియుతంగా తాలిబన్లకు అధికారం అప్పగిస్తామని ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. తాము కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడబోమని.. పౌరులను ఇబ్బంది పెట్టబోమని తాలిబన్లు కూడా వెల్లడించారు. శాంతియుతంగానే అధికార మార్పిడి జరుగుతుందని తెలిపారు. అధ్యక్ష భవనంలో చర్చల అనంతరం అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాబూల్‌ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఐతే ఎక్కడికి వెళ్లారన్న వివరాలు మాత్రం తెలియలేదు.

    అష్రఫ్ ఘనీ రాజీనామా చేయడంతో అలీ అహ్మద్ జలాలీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గతంతో ఆయన మంత్రిగా పనిచేశారు. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. ప్రస్తుతం ఆయనే తాత్కాలిక అధ్యక్షుడు అవుతారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    Afghanistan: ఆఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. లొంగిపోయిన అష్రఫ్ ఘనీ

    తాలిబన్లు నలువైపుల నుంచి కాబూల్ నగరాన్ని చుట్టుముట్టారు. కాబూల్ కేంద్ర కారగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5వేల మంది ఖైదీలను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. కాబూల్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆప్ఘానిస్తాన్ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. కాబూల్‌‌లో ఉంటున్నదేశ దౌత్య కార్యాలయానికి చీనూక్ హెలికాప్టర్లను పంపించి.. తమ సిబ్బందిని తరలిస్తోంది. చెక్ రిపబ్లిక్, బ్రిటన్ కూడా తమ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. భారత్ సైతం ఎయిర్ ఇండియా విమానం ద్వారా 129 మంది ప్రయాణికులను స్వదేశానికి తరలిస్తోంది. కాబూల్‌లో బయలుదేరిన ఈ విమానం మరికొన్ని గంటల్లోనే ఇండియాకు చేరనుంది.

    Taliban Effect on India: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు.. భారత్ ముందు  సరికొత్త సవాళ్లు

    ఆఫ్ఘనిస్తాన్‌లో రాష్ట్రాల రాజధానులన్నీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. శనివారం రాత్రి జలాలాబాద్‌ను ఆక్రమించేశారు. కొద్ది రోజుల క్రితమే దేశంలోని రెండు, మూడో అతిపెద్ద నగరాలైన హెరత్​, కాందహార్​లను స్వాధీనం చేసుకున్నారు. నిన్న నాలుగో అతిపెద్ద నగరమైన మెజర్​-ఏ- షరీఫ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. దాంతో దాదాపు ఆప్ఘానిస్తాన్ మొత్తం తాలిబన్ల వశమైంది. ఈ పరిణామాలతో ప్రజలు భయం భయంగా బతుకుతున్నారు. వారు పెట్టే నిబంధనలను.. హింసను భరించలేక పారిపోతున్నారు. ఇళ్లు, ఆస్తులను వదులకొని పిల్లా పాపలతో.. ప్రాణాలరచేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘానిస్తాన్ శరణార్థులకు వీసాలు ఇస్తున్న బ్రిటన్, కెనడా సహా ఇతర దేశాలు తరలి వెళ్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Afghanistan, Kabul, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు