ఆఫ్గనిస్తాన్ (Afghanistan)ను సొంతం చేసుకున్న తాలిబన్లు (taliban) ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విదేశాలతో పోరాటానికి సై అంటున్నారు. అగ్ర రాజ్యం అమెరికాకే వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మరోసారి మీడియా సమావేశాన్ని ర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా తీరును తీవ్రంగా తప్పు పట్టారు. అమెరికా తమపై కుట్రలు చేస్తోంది. ఎంతో నైపుణ్యం కలిగిన అఫ్గాన్లను తరలించుకు పోవడాన్ని నిలిపివేయాలని అమెరికాను హెచ్చరించారు. అలాగే అఫ్గన్లు దేశం విడిచి వెళ్లిపోవద్దని, కాబూల్‌లోని విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇకపై అనుమతించబోమని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ కు చెందిన వైద్యులు, ఇంజనీర్లు, ఇతర విద్యావంతులైన నిపుణులు తమకు చాలా అవసరమని తాలిబన్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుత గందరగోళ పరిస్థితుల కారణంగా అఫ్గాన్లను విమానాశ్రయానికి అనుమతించడం లేదని, విమానాశ్రయంలో ఉన్నవారు ఇంటికి వెళ్లిపోవాలని కోరారు. వారి భద్రతకు తమది పూర్తి హామీ అని పేర్కొన్నారు. బ్యాంకులు బుధవారం నుంచి పనిచేస్తాయని, ఆసుపత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, మీడియా సంస్థలు, లోకల్ పాలనా సంస్థలు ఇప్పటికే పనిలో ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు మహిళలపై ఆంక్షలను కొనసాగిస్తూ కీలక ప్రకటన చేశారు.
తొలి మీడియా సమావేశంలో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని.. వారంతా ఉద్యోగాల్లో చేరాలని ప్రకటించిన తాలిబన్లు ఇప్పుడు స్వరం మార్చారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్నేత తాజా హెచ్చరిక జారీ చేశారు. తమ భద్రత కోసం వారంతా ఇంట్లోనే ఉండాలన్నారు. అయితే భవిష్యత్తులో వాళ్లు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ రహస్య మంతనాలు జరిపారన్న వార్తలను ఆయన ఖండించారు. అలాంటి సమావేశం ఏదీ జరగలేదని తెలిపారు.
అలాగే పంజ్‌షీర్ సోదరులంతా కాబూల్‌కు తిరిగి రావాలని ముజాహిద్ కోరారు. భయపడొద్దు, తిరుగుబాటు చేయొద్దని కూడా ఆయన తెలిపారు. కాబూల్‌నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకునేందుకు గడువును పొడిగించబోమని మరోసారి తెగేసి చెప్పారు. ఆయన చెప్పినా ఈ సమావేశం జరిగిందని అంతర్జాతీయ మీడియా మాత్రం చెబుతోంది. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తరువాత అమెరికాలోని జో బైడెన్ సర్కార్, ఇస్లామిస్ట్ గ్రూప్ తాలిబన్ల మధ్య తొలిసారి భేటీ జరిగినట్టుగా అన్ని పత్రికలూ కథనాలు వెల్లడించాయి. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ తాలిబన్లతో రహస్య చర్చలు జరిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ బరాదర్‌తో సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ మాట్లాడినట్లు పేర్కొంది. తాలిబన్లతో కీలక నేతలతో బైడెన్ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత స్థాయి చర్చలుగా భావిస్తున్నారు.
ఇదీ చదవండి: తాలిబన్లు మరీ ఇంత దారుణమా..? శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారా..?
తాలిబాన్ నియంత్రణలో ఉన్నఅఫ్గాన్నుండి నుండి వేలాది మంది ప్రజలను తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది అంటూ ఆ కథనంలో ఉంది. . అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో సీఐఏ చీఫ్ బర్న్స్ అత్యంత అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త.. కాగా తాలిబన్ల కీలక నేతలు, కాబూల్‌లో అధికారం చేపట్టిన అగ్ర నాయకుల్లో బరాదర్ ఒకరు. అయితే ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం స్పష్టత లేదు. ఈ చర్చల సంగతి ఎలా ఉన్నా అమెరికా తన ప్రజలందరినీ ఆగస్టు 31 లోపు తరలించాల్సిందేనని తాలిబన్లు స్పష్టం చేశారు. అయితే ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర ఉన్నత విద్యావంతులను తరలిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, International news, Kabul, Taliban, World news