AFGHANISTAN NEWS LIVE UPDATES TALIBAN ENTERS INTO KABUL US EVACUATES DIPLOMATS SK
Afghanistan: ఆఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. లొంగిపోయిన అష్రఫ్ ఘనీ ప్రభుత్వం
తాలిబన్లు (ప్రతీకాత్మక చిత్రం)
Afghanistan: కాబూల్‌ను కూడా తాలిబన్లు ఆక్రమించడంతో అమెరికా అప్రమత్తమయింది. కాబూల్‌లో ఉన్న తమ దౌత్య సిబ్బందిని తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది. పలు చినూక్ హెలికాప్టర్లు అమెరికా దౌత్య కార్యాలయం పైకి చేరుకొన్నాయి.
అంతా అనుకున్నట్లే జరిగింది. తాలిబన్లు కాబూల్‌ను కూడా ఆక్రమించుకున్నారు. ఆప్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఐతే ఊహించిన దానికన్నా వేగంగా కాబూల్‌ను స్వాధీనం చేసుకొని తమ జెండా ఎగురవేశారు. నగరం నలుగుల వైపుల నుంచి తాలిబన్లు దూసుకెళ్లారు. ముజాహిదీన్లు నగరంలోకి ప్రవేశించగానే ఆప్ఘానిస్తాన్ ప్రభుత్వం లొంగిపోయింది. తాలిబన్లు కాబూల్‌పై ఎలాంటి దాడి చేయలేదని, అధికారి మార్పిడి శాంతియుతంగా జరుగుతుందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడి భవనం వైపు తాలిబన్లు దూసుకెళ్తున్నారు. మరికాసేపట్లో అధికార మార్పునకు సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశముంది.
కాబూల్‌ను కూడా తాలిబన్లు ఆక్రమించడంతో అమెరికా అప్రమత్తమయింది. కాబూల్‌లో ఉన్న తమ దౌత్య సిబ్బందిని తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది. పలు చినూక్ హెలికాప్టర్లు అమెరికా దౌత్య కార్యాలయం పైకి చేరుకొన్నాయి. హెలికప్టర్ల ద్వారా తమ సిబ్బందిని తరలిస్తున్నారు. కాసేపటికి అమెరికా దౌత్య కార్యాలయంపై నల్లటి పొగలు కనిపించాయి. కీలక పత్రాలను తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. తాలిబన్ల రాకతో కాబూల్‌లో సైనిక హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. పలు భవనాలు తగలబడుతూ కనిపించాయి. చెక్ రిపబ్లిక్ కూడా తమ దేశానికి చెందిన దౌత్య సిబ్బందిని అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించింది. రష్యా మాత్యం తమ దౌత్య సిబ్బంది విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది.
ఆప్ఘానిస్తాన్‌లోని 34 రాష్ట రాజధానుల్లో ఇప్పటికే 29 నగరాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. ఇవాళ కాబూల్‌తో పాటు మిగిలిన నగరాను కూడా స్వావధీనం చేసుకున్నారు. తాలిబన్ల అరాచకాలతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చాలా మంది ప్రాణాలరచేత పట్టుకొని పారిపోతున్నారు. ఇల్లు, ఆస్తులను వదిలేసుకొని.. పిల్లాపాపలతో పక్క దేశాలకు శరణార్థులుగా తరలివెళ్తున్నారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దును పాకిస్తాన్ పూర్తిగా మూసివేసింది. భారత్‌కు అనకూలంగా ఉండే ఆప్ఘానిస్తాన్ శరణార్థులకు వీసాలకు భారత్ ప్రభుత్వం భావిస్తోంది.
రాజధానిలోకి తాలిబన్లు ప్రవేశించడంతో.. కాబూల్‌లో బ్యాంకుల్లో నుంచి తాము దాచుకొన్న నగదు తీసుకోవడానికి ప్రజలు క్యూకట్టారు. ఇప్పటికే ఏటీఎంలు పనిచేయడం లేదు. తాలిబన్ల ఎంట్రీతో కాబూల్‌లో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనాలు వణికిపోతున్నారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అక్కడ తాలిబన్ల అరచకాలకు అడ్డే లేకుండాపోయింది. అప్పటికే గ్రామాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న తాలిబన్లు.. కొన్ని రోజులుగా పెద్ద పెద్ద నగరాలను సైతం ఆక్రమించుకుంటూ వస్తున్నారు. రాష్ట్రాల రాజధానులను తమ గుప్పిట్లోకి తీసుకుంటూ.. చివరగా దేశ రాజధాని కాబూల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారితో పోరాడలేక ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం లొంగిపోయింది. త్వరలోనే తాలిబన్ల నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.