హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan: తాలిబన్లు మరీ ఇంత దారుణమా..? శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారా..?

Afghanistan: తాలిబన్లు మరీ ఇంత దారుణమా..? శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాలిబన్లు నిజంగా అంత దారుణంగా ఉంటారా..? నరరూప రాక్షషుల్లా ప్రవర్తిస్తారా..? ఎంతలా అంటే శవాలను కూడా అత్యాచారం చేస్తారా..? ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఆఫ్గనిస్తాన్ ప్రముఖులే..

  తాలిబన్ల (Taliban) అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. అసలు కొన్ని వాస్తవాలు వినలాంటేనే భయపడే పరిస్థితి ఉంది. తాలిబన్లు చేసే ఆరాచకాలకు సంబంధించి రోజుకో వాస్తవం బయటపడుతోంది. తాజాగా తాలిబన్ల అరాచకాలు భరించే శక్తి తనకు లేదని, ఆ కారణంతోనే దేశం విడిచిపోయి వచ్చానని అఫ్గనిస్తాన్‌ (Afghanistan) మహిళ ముస్కాన్‌ అన్నారు. ఎంత దారుణమంటే.. చనిపోయిన శవాలపై కూడా తాలిబన్లు అత్యాచారాలకు పాల్పడతారంటూ ఆమె సంచలన వాస్తవాలు బయటపెట్టారు. అందుకే ఆమె తాజాగా అఫ్గన్‌ తాలిబన్ల హస్తమగతమైన నేపథ్యంలో భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఈ క్రమంలో తమ దేశంలోని భయానక పరిస్థితుల గురించి జాతీయ మీడియాకు వెల్లడించారు. న్యూస్‌18తో ముస్కాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళను పంపించాలని తాలిబన్‌ ఫైటర్లు కోరతారన్నారు ఆమె. ఎవరైనా తమతో రావడానికి నిరాకరిస్తే కాల్చి చంపేస్తారని.. మృతదేహాలపై కూడా వాళ్లు లైంగికదాడికి పాల్పడతారని.. ఒక మనిషి బతికుందా లేదా చచ్చిపోయిందా అన్న విషయాలతో వాళ్లకు సంబంధం ఉండదన్నారు. అక్కడ తమ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఒక్క విషయం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.

  ఇక ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగానికి వెళ్లే మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వారితో పాటు వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడతాయి అని ఆమె అన్నారు. సాధారణంగా ఎంత నియంతలైనా ఒకసారి వార్నింగ్ ఇస్తారు. కానీ తాలిబన్ల విషయానికి వస్తే అసలు కొన్ని సార్లు వార్నింగ్ లు కూడా ఉండవని.. కొన్ని సందర్భాల్లో ఒక్కసారి వార్నింగ్‌ ఇచ్చాక వినలేదంటే.. మరోసారి వార్నింగ్‌ కూడా ఉండదు. అంతం చేయడమే అంటూ తాలిబన్ల అరాచకాల గురించి ఆమె చెప్పుకొచ్చారు.

  అయితే తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా తాలిబన్లు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. కో ఎడ్యుకేషన్‌ రద్దు చేయడం, వేశ్యా గృహాల్లో జంతువులను ఉంచడం ద్వారా తమ వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకు మహిళలపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకు రావొద్దని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే బయటకు రావాలని ఆదేశించారు.

  ఇదీ చదవండి: బుల్లెట్టు బండి వధువుకు ఊహించని కానుక.. బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన సంస్థ

  మరోవైపు తమ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వెనుక పొరుగు దేశమైన పాకిస్తాన్‌ హస్తం ఉందని అఫ్గనిస్తాన్‌ పాప్‌స్టార్‌ అర్యానా సయీద్‌ ఆరోపించారు. అఫ్గన్‌ ప్రభుత్వం తాలిబన్లపై చర్యలకు ఉపక్రమించిన ప్రతిసారీ, పాక్‌ ఏదో ఒక విధంగా జోక్యం చేసుకునేదన్నారు. భారత్‌ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమని, అఫ్గనీయులకు ఎంతో సహాయం చేసిందని ధన్యవాదాలు తెలిపారు. శరణార్థులను అక్కున చేర్చుకున్న భారత్‌.. తమ దేశానికి నిజమైన స్నేహితుడు అని కృతజ్ఞతాభావం చాటుకున్నారు. అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన నేపథ్యంలో అర్యానా కూడా దేశం విడిచి పారిపోయారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Afghanistan, International news, Taliban

  ఉత్తమ కథలు