అఫ్గానిస్థాన్‌లో తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అగ్రరాజ్యం అమెరికా నిర్దేశించుకున్న గడువు రేపటితో(ఆగస్టు 31) ముగియనుంది. అమెరికా బలగాల ఉపసంహరణ వెంటనే.. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోవడానికి తాలిబన్లు సిద్దంగా ఉన్నారు. వీరు ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ప్రస్తుత అఫ్గాన్‌లో నెలొకన్ని పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అఫ్గాన్‌ను చేతిలో తీసుకున్నప్పటీ నుంచి.. చాలా దేశాలు తమ దౌత్య సిబ్బందిని, పౌరులను అఫ్గానిస్తాన్ (Afghanistan) నుంచి స్వదేశాలకు తరలించే ప్రక్రియను చేపట్టాయి. మరోవైపు చాలా మంది అప్గాన్ పౌరులు, అమెరికా బలగాలకు సహకరించిన వారు కూడా పెద్ద ఎత్తున దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ విమాశ్రయానికి చేరుకుంటున్నారు. ఎలాగైనా సరే దేశం విడిచి వెళ్లాలని వీరంతా భావిస్తున్నారు.
అయితే గత నాలుగైదు రోజులుగా కాబూల్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ తరలింపు ప్రక్రియకు కొంతమేర విఘాతం కలిగించాయనే చెప్పాలి. కాబుల్ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కాబూల్ ఎయిర్‌పోర్ట్(Kabul Airport) వద్ద జరిగిన పేలుడు, ఆత్మహుతి దాడిలో దాదాపు 200 మందికి పైగా చనిపోయారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. అయితే ఈ దాడులకు సూత్రదారిగా ఉన్న ఐసీస్-కే సూత్రధారిని మట్టుబెట్టినట్టు అమెరికా ప్రకటించింది.
Yediyurappa: తన నిర్ణయంతో బీజేపీలో ప్రకంపనలు రేపుతున్న యడియూరప్ప.. బీజేపీలో ఉంటూనే..
అయితే నిన్న మరోసారి కాబూల్‌లో భారీ ఉగ్ర కుట్రను అమెరికా భగ్నం చేసింది. నిన్న ఎయిర్‌పోర్టు వద్ద త్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గమనించిన అమెరికా భద్రతా బలగాలు డ్రోన్ దాడి ద్వారా వారిని మట్టుబెట్టాయి. మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు కొద్ది దూరంలో ఉన్న ఖువ్జా బుఘ్రా ప్రాంతంలో రాకెట్ దాడి జరగగా.. ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, సోమవారం ఉదయం కాబుల్ (Kabul) ఎయిర్‌పోర్టు వైపు రాకెట్లు దూసుకురాగా.. వీటిని క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చేసినట్లుగా తెలుస్తోంది. ఈ భారీ శబ్దాలకు ఆ పరిసరాల ప్రాంతాల్లో ఉన్న జనం భయంతో పరుగులు తీశారు. మొత్తం 5 రాకెట్లు ప్రయోగించినట్లు స్థానిక మీడియా కథనాల సమాచారం.
Huzurabad by Poll: హుజురాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. ఆ మహిళ నేతకు మెజారిటీ నాయకుల మద్దతు..!
ఇప్పటికే పలు దేశాలు తమ పౌరులను అఫ్గాన్ నుంచి తరలించాయి. అయితే కొన్ని దేశాలుకు చెందిన పౌరులు ఇప్పటికే అఫ్గాన్‌లో చిక్కుకున్నారు. భారత్ విషయానికి వస్తే.. ఇప్పటికే అఫ్గాన్‌లో చాలా మందిని అధికారులు స్వదేశానికి తీసుకొని వచ్చారు. అయితే ఇప్పటికీ.. 20 మంది వరకు భారతీయులు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లో(Indians Still Stuck in Afghanistan) ఉన్నారని విశ్వసనీయ వర్గాలు News18కి తెలిపాయి. కాబూల్ విమానాశ్రయంలో నెలకొన్న భద్రత కారణాల దృష్ట్యా.. అఫ్గాన్‌లో చిక్కుకున్నవారిని తక్షణమే అక్కడి నుంచి తరలించే అవకాశం లేకుండా పోయిందని ఆ వర్గాలు చెప్పాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.