అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన దగ్గరి నుంచి అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న విదేశీయులతో పాటు.. అనేక మంది స్థానికులు కూడా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది దేశం దాటారు. అక్కడి ప్రజలు దేశం దాటేందుకు ఉన్న ఏకైక మార్గం కాబుల్ విమానశ్రయం. దీంతో ఆ విమానాశ్రయం వద్దకు నిత్యం వేలాదిగా ప్రజలు వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ నిన్న ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో 169 మంది ఆఫ్గాన్ పౌరులే ఉన్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 28 మంది తాలిబన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య 150కి చేరినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్థానికులు, విమానాశ్రయానికి చేరుకున్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అయితే కాబులో మరో బాండు దాడి జరగవచ్చన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ భద్రతా బృందం అమెరికా అధ్యక్షడు జో బైడెన్ కు సమాచారం ఇచ్చింది. ఈ వివరాలను వైట్ హౌస్ మీడియా కార్యదర్శ జెన్ సాకి మీడియాకు వెల్లడించారు. ఈ నెలఖరు నాటికి కాబుల్ నుంచి అమెరికా తన దళాలను ఉపసంహరించుకుంటుందని మరో మారు ఆయన స్పష్టం చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కాబుల్ నుంచి అమెరికా పౌరులను, ఆఫ్గన్లను తరలింపును పూర్తి చేయాల్సి ఉందని ఆయన అన్నారు.
Kabul Blasts: కాబూల్ పేలుళ్లలో 90 మంది మృతి.. అమెరికా ఆగ్రహం.. ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్
ఇదిలా ఉంటే.. ఈ పేలుళ్లకు తామే పాల్పడినట్టు ఐసిస్-కే (Isis-K) ప్రకటించింది. ఐసిస్-కే పూర్తి పేరు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP). ఐసిస్ (ISIS)కు ఇది ప్రాంతీయ అనుబంధ సంస్థ. ఐసిస్-కే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లో యాక్టివ్‌గా ఉంది. ఆప్ఘనిస్థాన్‌లో ఉన్న అన్ని ఉగ్రవాద గ్రూపుల కంటే ఐసిస్-కే చాలా ప్రమాదకరమైన, హింసాత్మకమైన గ్రూపు. ఇరాక్, సిరియాలో ఐఎస్ తిరుగులేని శక్తిగా ఉన్న 2015లో ఐసిస్-కే ప్రారభమైంది. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ జిహాదిస్టులను ఐసిస్-కే చేర్చుకుంటుంది. అలాగే తమ సంస్థ సరైన తీవ్రతతో లేని భావించే తాలిబన్లు కూడా ఆ గ్రూపులో చేరుతుంటారు.
ఆప్ఘనిస్తాన్ ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు..?
క్రూరత్వం, అత్యంత హింసాత్మకతకు ఐసిస్-కే మారుపేరుగా మారిపోయింది. కొన్నేళ్లుగా చాలా భయానక పేలుళ్లకు ఈ గ్రూపు పాల్పడింది. బాలికల పాఠశాలలు, ఆసుపత్రులు, అందులోనూ మెటర్నటీ వార్డులే లక్ష్యంగా బాంబు పేలుళ్లు, మానవ బాంబు దాడులకు ఐసిస్-కే పాల్పడింది. వీరి దాడుల్లో చాలా మంది బాలికలు, గర్భవతులు, నర్సులు చనిపోయారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌కే పరిమితం కాగా.. ఐసిస్-కే ప్రపంచవ్యాప్త ఐఎస్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యమై ఉంది. పాశ్చాత్య, అంతర్జాతీయ దేశాల్లో దాడులతో పాటు మానవతావాదులను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Terrorists