కాబూల్ నుంచి 168 మంది ప్రయాణికులు. ఉత్తరప్రదేశ్‌లో ఫ్లైట్ ల్యాండ్

ఉత్తరప్రదేశ్‌లో ఫ్లైట్ ల్యాండ్ (image credit - twitter - ANI)

భారత్ ఎంత గొప్ప దేశం అంటే... ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారతీయుల్ని మాత్రమే కాదు... విదేశీయుల్ని కూడా ఇండియాకి తీసుకొస్తోంది. అలా తాలిబన్ ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను కాపాడుతోంది.

 • Share this:
  ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) C-17 యుద్ధ విమానం... ఉత్తరప్రదేశ్... ఘజియాబాద్‌లోని... హిండన్ IAF బేస్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇందులో 168 మంది ప్రయాణికులు ఉండగా... వారిలో 107 మంది భారతీయులు. మిగతా 61 మంది విదేశీయులు. ఐతే... వీరెవరూ ఎయిర్‌పోర్ట్ దాటి బయటకు రావట్లేదు. ఎందుకంటే వారికి అక్కడ ముందుగా కోవిడ్ RT-PCR టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్టులో నెగెటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతారు. అదే పాజిటివ్ వస్తే... లక్షణాలను బట్టీ... క్వారంటైన్ లేదా ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ వంటి కండీషన్లు పెట్టనున్నారు.

  ఈ ఫ్లైట్ కంటే ముందు... నిన్న ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి... 87 మంది భారతీయులు, ఇద్దరు నేపాలీయులతో... బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం... తజకిస్థాన్ (Tajikistan) వెళ్లి... అక్కడి నుంచి ఇవాళ ఇండియాలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చేరింది. ఇందులో 87 మంది భారతీయులతోపాటూ... ఇద్దరు నేపాలీయులు కూడా సురక్షితంగా ఇండియా వచ్చారు.


  ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు అస్సలు బాలేవు. దుర్మార్గులైన తాలిబన్లు... అక్కడి స్థానికులను చావగొడుతున్నారు. ఇన్నాళ్లూ అమెరికా సైన్యానికి సహకరించారు అంటూ... చితకబాదుతున్నారు. తుపాకులతో గుచ్చుతున్నారు. కొంత మందిని చంపుతున్నారు. మళ్లీ అరాచకపాలన మొదలైంది. ఇలాంటి సమయంలో భారతీయులు అక్కడి నుంచి రావడం అనేది పెను సవాలుగా మారింది. సమస్యేంటంటే... కాబూల్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ తాలిబన్లే ఉన్నారు. వారు... డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించాకే... ఎయిర్‌పోర్టులోకి అనుమతిస్తున్నారు. అందువల్ల భారతీయుల్ని జాగ్రత్తగా ఇండియా తీసుకురావడం అనేది మన విదేశాంగ శాఖకు పెను సవాలుగా మారింది. భారతీయులు కూడా తాలిబన్లకు ఆగ్రహం తెప్పించకుండా... వారు ఏం కోరితే ఆ డాక్యుమెంట్లు చూపించి... వారికి సహకరిస్తూ... ఇండియా చేరుతున్నారు.  ఇది కూడా చదవండి: Raksha bandhan: బంగారు, వెండి నగల రాఖీలకు డిమాండ్!

  తాజా పరిణామాల మధ్య ఇండియా రోజూ రెండు ఫైట్లను నడిపేందుకు అమెరికా నాటో బలగాలు అనుమతి ఇచ్చాయి. ప్రస్తుతం ఇండియాకు చెందిన 700 మంది దాకా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం. రెండ్రోజుల్లో వారంతా ఇండియా వచ్చేస్తారని అనుకోవచ్చు.
  Published by:Krishna Kumar N
  First published: