Afghanistan: ఐరాస పిలుపుతో వెల్లువెత్తిన అంతర్జాతీయ సమాజం దాతృత్వం.. అఫ్గాన్‌కు భారీ స్థాయి ఆర్థికసాయం!

ఆఫ్గనిస్థాన్ కు భారీ సాయం

Afghanistan: అమెరికాలాంటి అగ్రరాజ్యాలు అన్నీ ఆఫ్గనిస్తాన్ పై ఆర్థికంగా ఆంక్షలు పెట్టాయి. దీంతో ఆ దేశం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఐక్యరాజ్య సమితి పిలుపుతో .. ఆఫ్గాన్ కు ఆర్ధిక సాయం అందనుంది.

 • Share this:
  Help to Afghanistan: ఆఫ్గనిస్తాన్ (Afghanisthan) పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఆర్థికంగా పూర్తిగా ఇబ్బందుల్లో పడింది. దీంతో తాలిబన్లు (Taliban) చెరబట్టిన అఫ్గాన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు భారీ స్థాయిలో ఆర్థికసాయం చేస్తామని ప్రకటించాయి. ప్రస్తుతం కరువు, పేదరికం, వలసలతో సతమతమవుతున్న అఫ్గాన్‌ ప్రజల ఆకలి, వసతుల కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్థిక సాయం చేస్తామని పలు దేశాలు హామీ ఇచ్చాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ వెల్లడించారు. ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్‌ సూచించారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్‌కు సత్వర ఆర్థిక సాయం కోరుతూ ఐరాస జెనీవాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలని గుటెర్రస్‌ కోరింది. ‘ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సమాజం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా 1.2 బిలియన్‌ డాలర్ల సాయం చేస్తామని ‘ముఖ్యమైన’ దేశాలు ప్రకటించాయి. దీంతో అంచానాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో విరాళాలు వస్తున్నాయి.

  తాలిబన్ల అనుమతి లేకుండా మానవతా కార్యక్రమాల అమలు అసాధ్యం. మానవ హక్కులు, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదం.. అంశమేదైనా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సాయం అందాలంటే తాలిబన్‌ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాల్సిందే’ అని ఆయన స్పష్టంచేశారు.

  ఇదీ చదవండి: సిరి షర్ట్ లో సన్నీ చేయ పెట్టాడా..? ఆడుతూ కుప్పకూలిన లోబో..

  తాలిబన్ల దురాక్రమణ, కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర వేలాది మంది అఫ్గాన్‌ అభాగ్యుల పడిగాపులు, బాంబు పేలుళ్లు వంటి విషాదకర ఘటనలతో స్థానికుల భవిష్యత్‌ అగమ్యగోచరమైన నేపథ్యంలో ఐరాస అక్కడ సహాయ కార్యక్రమాలను కొనసాగించడం తప్పనిసరి’ అని గుటెర్రస్‌ వ్యాఖ్యానించారు.

  ఇదీ చదవండి: సారీ.. పొరపాటున ట్వీట్ చేశా..? సైదాబాద్ నిందితుడు దొరకలేదన్న కేటీఆర్

  మరోవైపు తాలిబన్ల పంట పండింది. అమ్రుల్లా సలేహ్‌.. అఫ్గనిస్తాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయిన తర్వాత.. సలేహ్‌ తనను తాను కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై తాలిబన్ల ఆక్రమణ తర్వాత అజ్ఞాతంలో ఉంటూ.. తాలిబన్లతో పోరాటం కొనసాగుతుందని ప్రకటించాడు కూడా. అయితే ఆయన ఇంట్లో తాలిబన్లు తాజాగా సోదాలు నిర్వహించారు. సుమారు 6 మిలియన్ల విలువ చేసే డాలర్లు(మన కరెన్సీలో 45 కోట్ల రూ. దాకా), 18 పెద్ద బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్‌ మల్టీమీడియా బ్రాంచ్‌ చీఫ్‌ అహ్మదుల్లా ముట్టాఖీ తన ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశాడు.
  Published by:Nagesh Paina
  First published: