ఆప్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన వెంటనే ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు దేశం విడిచి ఎక్కడికో ఒక చోటికి వెళ్లిపోయారు. కొందరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. అయితే ఘనీ దేశం విడిచిపోయిన వెంటనే.. తానే దేశానికి అధ్యక్షుడినని ప్రకటించుకున్న ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కూడా దేశం విడిచి వెళ్లిపోయారని కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన కూడా ఆప్ఘన్ నుంచి పారిపోయారనే ప్రచారం సాగింది. అయితే దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చింది. తాను ఎక్కడికి పారిపోలేదని తెలిపారు. తాను పంజ్‌షీర్ లోయలో ఉన్నానని వెల్లడించారు. తాను పంజ్‌షీర్ లోయలో ఉన్నానని.. తన కమాండర్లతో పాటు రాజకీయ నాయకులతో ఉన్నానని అమ్రుల్లా చెప్పుకొచ్చారు.
తనపై తాలిబన్లు దాడి చేసినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన అమ్రుల్లా.. ఇది కష్టమైన పరిస్థితి అని అన్నారు. తాలిబన్లు, పాకిస్థానీలు, అల్‌ఖైదా సహా ఇతర టెర్రరిస్ట్ గ్రూపులు రెచ్చిపోతున్నాయని.. అయినా తాము దేశం విడిచిపోలేదని అన్నారు. కొద్దిరోజులుగా తాలిబన్లు ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయారని అన్నారు. ఆష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయినప్పటికీ.. అమ్రుల్లా మాత్రం తాలిబన్లకు తలొగ్గలేదు. అయితే పంజ్‌షీర్ కమాండర్ల రక్షణలో అమ్రుల్లా రెండు విమానాల్లో దేశం విడిచిపోయారని మీడియాలో కథనాలు వచ్చాయి.
Huzurabad: ‘హుజూరాబాద్’పై రేవంత్ రెడ్డికు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇస్తుందా ?
Night: రాత్రిపూట తరచూ గొంతు తడారిపోతుందా ?.. చాలా డేంజర్.. దేనికి సంకేతమో తెలుసా..
పంజ్‌షీర్ లోయ ఆర్మీకి అమ్రుల్లా సాయం లేకుండా చేయాలని తాలిబన్లు భావిస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో పని చేసినందుకు ఆయనకు ఇంటలిజెన్స్ విభాగంపై అవగాహన ఉంటుందని.. ఆయనను కట్టడి చేస్తే పంజ్‌షీర్ లోయను స్వాధీనం చేసుకోవడం సాధ్యమవుతుందని తాలిబన్లు నమ్ముతున్నారు. అమ్రుల్లా సలేహ్ 1972లో పంజ్‌షీర్‌లో జన్మించారు. ఆయన చెల్లెలిని తాలిబన్లు 1996లో చిత్రహింసలు పెట్టి చంపేశారు.
మరోవైపు అఫ్ఘాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై పట్టు సాదించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వందల సంఖ్యలో తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీపై దాడి చేసేందుకు వెళ్తున్నారు. అయితే నార్తర్న్ అలయెన్స్ సైన్యం తాలిబన్లను తమ సరిహద్దుల్లోకి రాకముందే మట్టుబెడుతుంది. అఫ్ఘాన్ లో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు పంజ్‌షేర్ వ్యాలీని మాత్రం స్వాధీనం చేసుకోలేక పోతున్నారు.
శత్రుదుర్బేధ్యమైన కొండల్లోంచి వెళ్లాలంటే తాలిబన్లు హడలిపోతున్నారు. ఇక తాలిబన్లు వచ్చే మార్గాల్లో నార్తర్న్ అలయెన్స్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వీరి దాడిలో 450 మంది తాలిబన్లు హతమైనట్లు రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించింది. పంజ్‌షేర్‌పై పట్టు సాధిస్తునట్టు తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని , వాళ్లు ఒక్క అంగుంళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదని నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Taliban