Afghanistan Earthquake: మన పొరుగు దేశాలపై ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప ధాటికి చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1 నమోదయినట్లు ఆప్ఘనిస్తాన్ స్థానిక మీడియా వెల్లడించింది. ఖోస్ట్ నగరానికి 44 కి.మీ. దూరంలో..భూమి నుంచి 51 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్న USGS తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
భూకంప ధాటికి చాలా చోల్ల ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనల్లో కనీసం 250 మంది మరణించినట్లు ఆప్ఘన్ స్థానిక మీడియా తెలిపినట్లు వెల్లడించింది. ఖోస్ట్, నంగర్హార్ ప్రావిన్స్‌లో ఎక్కువ నష్ట వాటిల్లినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలాలకు చేరుకుంటున్నారని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
అర్ధరాత్రి సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి చాలా చోట్ల భవనాలు కుప్పకూలాయని.. శిథిలాల్లో చాలా మంది చిక్కుకొని ఉన్నారని పేర్కొన్నారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
అటు పాకిస్తాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. లాహోర్, ఇస్లామాబాద్, ముల్తాన్, క్వెటా, పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సహా పలు ప్రాంతాంలో భూకంపం సంభవించింది. అప్ఘనిస్తాన్‌లోని భూకంప కేంద్రం నుంచి దాదాపు 500 కి.మీ. చుట్టుపక్కల భూప్రకంపనలు సంభవించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. భారత్‌లోనూ పలు చోట్ల భూమి కంపించింది. కానీ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.