AFGHANISTAN CRISIS UPDATES AT LEAST 5 DEAD AT KABUL AIRPORT AS HUNDREDS TRY TO FORCIBLY ENTER PLANES SU
Afghanistan Crisis: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు.. 5 గురు మృతి.. దారుణంగా పరిస్థితులు..
కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు(Image-Ap)
అఫ్గానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి జనాలు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అఫ్గానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి జనాలు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సరిహద్దుల వైపు పరుగులు తీస్తుంటే.. మరికొందరు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తున్నారు. కొద్ది రోజులుగా పలు పట్టణాలను తమ ఆధీనంలో తీసుకుంటూ ముందుకు సాగుతున్న తాలిబన్లు.. ఆదివారం నలువైపుల నుంచి దేశ రాజధాని కాబూల్‌లోకి చొరబడి హస్తగతం చేసుకున్నారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లడం.. అక్కడి జనాలను మరింత భయాందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు భారీగా జనాలు తరలివస్తున్నారు. తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి దేశం విడిచి వెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌లో భారీగా రద్దీ ఏర్పడింది.
విమానాల్లోకి ఎక్కేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జనాల మధ్య తోపులాట చోటుచేసుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అమెరికా భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరిణించారు. తొలుత భద్రత బలగాలు గాల్లోకి కాల్పులు జరిగినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత భద్రత బలగాల 5 గురు మరణించినట్టుగా తెలిసింది.
ఇక, అఫ్గానిస్తాన్‌లో కేవలం కాబూల్ ఎయిర్పోర్ట్ మాత్రమే ప్రస్తుతానికి అమెరికా బలగాల చేతిలో ఉంది. అయితే అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దీంతో కాబూల్‌కు విమానాలు వెళ్లలేని పరిస్థితి.
This is, perhaps, one of the saddest images I've seen from #Afghanistan. A people who are desperate and abandoned. No aid agencies, no UN, no government. Nothing. pic.twitter.com/mvJKdf8ZQE
అఫ్గానిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో అక్కడ ఉన్న తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు భారత్, అమెరికా సహా పలు దేశాలు చర్యలు చేపట్టాయి. పలు దేశాలు అఫ్గాన్ మీదుగా ప్రయాణించే విమానాలను దారిమళ్లిస్తున్నాయి. ఇక, అఫ్గాన్ గగనతలాన్ని మూసివేసినట్టుగా తెలియడంతో.. కాబూల్‌కు విమానాలను పంపలేకపోతున్నామని ఎయిర్ఇండియా వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి దిల్లీకి వచ్చే తమ విమానాలను అఫ్గాన్ మీదుగా వెళ్లకుండా దారిమళ్లిస్తున్నట్టు తెలిపాయి. మరోవైపు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది. తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.