‘మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకోకండి బాబూ..’ నేతలకు హితవు చెబుతున్నదెవరంటే..

ప్రతీకాత్మక చిత్రం

‘ఇద్దరు, ముగ్గురు, నలుగురిని పెళ్లిళ్లు చేసుకోకండి. ఒక భార్యతో హ్యాపీగా ఉండండి. ఒక పెళ్లికి పరిమితం అవ్వండి. తప్పనిసరి అయితేనే రెండో పెళ్లి చేసుకోండి. అలాగే, విపరీతంగా పెళ్లిళ్ల మీద డబ్బులు ఖర్చు పెట్టకండి.’ ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు.

  • Share this:
    ‘ఇద్దరు, ముగ్గురు, నలుగురిని పెళ్లిళ్లు చేసుకోకండి. ఒక భార్యతో హ్యాపీగా ఉండండి. ఒక పెళ్లికి పరిమితం అవ్వండి. తప్పనిసరి అయితేనే రెండో పెళ్లి చేసుకోండి. అలాగే, విపరీతంగా పెళ్లిళ్ల మీద డబ్బులు ఖర్చు పెట్టకండి.’ ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు. అఫ్ఘనిస్తాన్ అధినేత హైబతుల్లా అఖుంజాదా. తాలిబన్ నేతలకు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారు. నేతలు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కోసం, ఆ పెళ్లిళ్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాగే, కొత్తగా పెళ్లయిన భార్యలను తీసుకుని అరబ్ దేశాలు, పాకిస్తాన్‌కు వెళ్లి ఖరీదైన జీవితం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన అంశాల్లో ప్రజల్లో బలంగా వెళ్తున్నాయి. దేశంలో పరిస్థితులను పట్టించుకోకుండా నేతల ఖరీదైన జీవితాలు అనుభవించడాన్ని చూసి జనం తప్పుపట్టే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో తాజా ఆదేశాలు వచ్చాయి. పెద్ద పెద్ద పెళ్లిళ్ల కోసం లీడర్లు 20,000 యూరోల నుంచి 70,000 యూరోల వరకు వధువు కుటుంబానికి అందిస్తున్నారు. నేతలు తమ కొత్త భార్యల కోసం ప్రత్యేకంగా ఇళ్లు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల అదనంగా ఖర్చులు అవుతున్నాయి. ఇక ప్రస్తుత చీఫ్‌కు ఇద్దరు భార్యలు. మరికొందరికి ముగ్గురు భార్యలు ఉన్నారు.

    దేశంలో పెద్ద పెద్ద నేతలు అందరూ ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటూ ఎక్కువ మంది భార్యలతో ఖరీదైన జీవితాలను అనుభవిస్తున్నారు. అయితే, వీరందరికీ అంత డబ్బు ఎలా వస్తుందనే అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వారంతా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లీడర్లు పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ ఆ డబ్బులతో మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుంటోంది. ఇటీవల దోహాలో అమెరికా ప్రతినిధులతో కొన్ని చర్చలు జరిగాయి. ఈ సమావేశాలకు హాజరైన అఫ్ఘాన్ ప్రతినిధులు వారు తమ కొత్త భార్యలను తీసుకుని వచ్చారు. అలాగే, తమకు పిల్లనిచ్చిన వారికి పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: