హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Afghanistan News: తాలిబన్ల అరాచకం.. సంబరాలు జరుపుకుని 17 మంది ప్రాణాలను బలిగొన్నారు..

Afghanistan News: తాలిబన్ల అరాచకం.. సంబరాలు జరుపుకుని 17 మంది ప్రాణాలను బలిగొన్నారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆఫ్ఘనిస్తాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తున్నారు. పంజ్‌షీర్ ప్రాంతం మినహా ఆఫ్టనిస్తాన్‌ను(Afghanistan) అక్రమించిన తాలిబన్లు.. తాజాగా ఆ ప్రాంతాన్ని కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నట్టుగా ప్రకటించారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తున్నారు. పంజ్‌షీర్ ప్రాంతం మినహా ఆఫ్టనిస్తాన్‌ను(Afghanistan) అక్రమించిన తాలిబన్లు.. తాజాగా ఆ ప్రాంతాన్ని కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే పంజ్‌ షీర్‌లోని తిరుగుబాటు దళాలు మాత్రం ఈ వార్తలను ఖండించాయి. పంజ్‌ షీర్ ప్రాంతాన్ని తాలిబన్లు(Taliban) స్వాధీనం చేసుకోలేదని వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పంజ్‌షీర్(Panjshir) స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న తాలిబన్లు రెచ్చిపోయారు. దీంతో సంబరాల పేరుతో కాబూల్‌లో పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. అయితే ఇది అమాయకులైన 17 మంది మరణాలకు కారణమైంది. ఈ మేరకు Shamshad న్యూస్ ఏజెన్సీ వివరాలను వెల్లడించింది. శుక్రవారం కాబూల్‌లో(Kabul) తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపడం వల్ల.. 17 మంది ప్రజలు చనిపోయారు, 41 మంది గాయపడ్డారు అని పేర్కొంది. టోలో న్యూస్ (Tolo News) కూడా ఇదే రకమైన వార్తను ప్రసారం చేసింది.

కాబూల్‌కు తూర్పు ప్రాంతంలో ఉన్న నంగర్‌హార్ (Nangarhar province) ప్రావిన్స్‌లో జరిగిన కాల్పుల్లో కనీసం 14 మంది గాయపడ్డారని ప్రాంతీయ రాజధాని జలాలాబాద్‌(Jalalabadలోని ఏరియ ఆస్పత్రి వైద్యుడు గుల్జాదా సంగర్ తెలిపారు. అయితే కాల్పులు జరపడం వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారని, 20 మంది గాయపడ్డారని కాబూల్‌లోని ఎమర్జెన్సీ ఆస్పత్రి తెలిపినట్టుగా AFP పేర్కొంది. మరోవైపు గాల్లోకి కాల్పులు జరపవద్దని తాలిబన్ల ప్రధాన అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ (Zabihullah Mujahid).. వారి ఫైటర్లను కోరారు. ఇందుకు బదులు దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. ‘మీకు ఇచ్చిన ఆయుధాలు, తూటాలు ప్రజల ఆస్తి. వాటికి వృథా చేసే హక్కు ఎవరికీ లేదు. బుల్లెట్లు పౌరులకు కూడా హాని కలిగిస్తాయి’అని జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.

Shocking: ఆమెకు పెళ్లి జరిగి మూడేళ్లయింది.. మాజీ ప్రియుడి నుంచి బెదిరింపులు.. అతడిని కలిశాక..


అయితే అమెరికా తన బలగాలను ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఉపసంహరణ మొదలుపెట్టగానే.. తాలిబన్లు చాలా వేగంగా పావులు కదిపారు. చాలా తక్కువ సమయంలో ఆఫ్ఘానిస్తాన్‌ను తమ సొంతం చేసుకన్నారు. ఊహించిన దాని కంటే వేగంగా రాజధాని కాబూల్‌లో కూడా కాలు మోపారు. అయితే పంజ్ షీర్‌ వ్యాలీలో మాత్రం ఇందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అప్పుడు ఉప అధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్‌ పంజ్‌షేర్‌ దళాలతో కలిసిపోయారు. అమ్రుల్లాతో పాటుగా తాలిబన్ వ్యతిరేక నాయకుడు అహ్మద్ షా మసూద్ (Ahmad Shah Massoud) కొడుకు అహ్మద్ మసూద్‌ (Ahmad Massoud) కూడా ఉన్నారు. వీరి మార్గదర్శకత్వంలో ముందుకు సాగిన పంజ్ షీర్ దళాలు.. వందల సంఖ్యలో తాలిబన్లను మట్టుబెట్టినట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా అమ్రుల్లా సలేహ్ దేశాన్ని విడిచి పరారైనట్లు వార్తలు వస్తున్నాయి. కొందరు పంజ్‌షేర్‌ కమాండర్లతో కలిసి రెండు విమానాల్లో తజికిస్థాన్‌కు(Tajikistan) వెళ్లిపోయినట్టుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే.. పంజ్ షీర్‌కు అన్ని రకాల రాకపోకలపై నిషేధం విధించారు, ఫోన్‌ సిగ్నళ్లు, విద్యుత్తు సరఫరా, చివరకు వైద్య సంబంధిత సామగ్రిని కూడా నిలిపివేశారని అమ్రూల్ సలేహ్ ట్వీట్ చేశారు. తాలిబన్లు యుద్ద వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించాలని కోరారు.

ఇక, తాజాగా.. తాలిబన్ వర్గాలు పంజ్‌ షీర్ వ్యాలీని తమ సొంతం చేసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే ఆ వార్తలను ఖండించిన అమ్రుల్లా సలేహ్(Amrullah Saleh).. ‘పరిస్థితి క్లిష్టంగా ఉంది, మేము పోరాటంలో ఉన్నాం’అని ఒక వీడియో ద్వారా తెలియజేశాడు. ప్రస్తుతం ప్రతిఘటన కొనసాగుందని చెప్పారు.

First published:

Tags: Afghanistan, Kabul, Taliban

ఉత్తమ కథలు