Home /News /international /

AFGHAN WOMEN EDUCATING GIRLS IS PART OF AFGHAN CULTURE CONTROVERSIAL REMARKS BY PAKISTANI PRIME MINISTER IMRAN KHAN EVK

Afghan Women: ఆడపిల్లలకు చదువు చెప్పకపోవడం ఆఫ్ఘన్ సంస్కృతిలో భాగం.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఇమ్రాన్​ఖాన్​ (ఫైల్​)

ఇమ్రాన్​ఖాన్​ (ఫైల్​)

Imran Khan Comments on Afghan Women పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ ఆఫ్ఘ‌న్ మ‌హిళ‌ల‌పై తాజాగా చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఆయ‌నఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) స‌మావేశంలో మాట్లాడుతూ ‘ఆడపిల్లలకు చదువు చెప్పకపోవడం ఆఫ్ఘన్ సంస్కృతిలో భాగం’ అంటూ ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఇంకా చదవండి ...
    పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) ఆఫ్ఘ‌న్ మ‌హిళ‌ల‌పై తాజాగా చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఆయ‌నఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) స‌మావేశంలో మాట్లాడుతూ ‘ఆడపిల్లలకు చదువు చెప్పకపోవడం ఆఫ్ఘన్ సంస్కృతిలో భాగం’ అంటూ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దీనిపై అంత‌ర్జాతీయంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసీ) సభ్యుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆఫ్ఘన్ మహిళలను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ చేసిన స్త్రీ వ్యతిరేక వ్యాఖ్యలు సమావేశానికి హాజరైన పాశ్చాత్య ప్రభుత్వ పరిశీలకుల దృష్టికి వెళ్లలేదని అల్ అరేబియా పోస్ట్ నివేదించింది.

    ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌పై దుమారం చెల‌రేగుతున్న క్ర‌మంలోనే ఆఫ్ఘ‌న్‌లో మ‌హిళ‌ల‌పై ఆంక్ష‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.  మ‌హిళ‌ల ప‌ట్ల తాలిబ‌న్‌ (Taliban) ల వైఖ‌రిపై ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ స‌మాజం చాలా సార్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. తాజాగా తాలిబ‌న్‌లు సొంత బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టుకొన్నారు. అనంత‌రం ప్ర‌స్తుతం కొత్తగా మ‌హిళ‌ల‌పై కొత్త ఆంక్ష‌లు విధించింది. ముఖ్యంగా మహిళలపై ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేసిన తాలిబాన్ మంత్రిత్వ శాఖ.

    CoWIN Registration for Children: పిల్ల‌ల‌కు కోవిడ్‌ వ్యాక్సిన్.. ఎప్ప‌టి నుంచి రిజిస్ట‌ర్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి!


    మ‌హిళ‌లు ఒంట‌రిగా ప్ర‌యాణం చేయ‌కూడ‌దని తెలిపింది. బంధువులైన‌ మ‌గ‌వారితో క‌లిసి మాత్ర‌మే ప్ర‌యాణం చేయాల‌ని సూచించింది.. ప్రయాణించే పురుషులు పురుషులతో పాటు వెళ్లాలని పేర్కొంది. ఈ విష‌యాన్ని మ‌హిళా మంత్రిత్వ శాఖ పేర్కొంది.  మ‌హిళ‌లు 72 కి.మీ కంటే ఎక్కువ దూరం ఒంట‌రిగా ప్ర‌యాణించ‌కూడ‌ద‌ని పేర్కొంది. ఎవ‌రైన బంధువుల‌లో మ‌గ‌వారితో క‌లిసి మాత్ర‌మే క‌లిసి ప్ర‌యాణించాల‌ని స్ప‌ష్టం చేసింది.

    అంతే కాకుండా మ‌హిళ‌లు హిజాబ్ ధరించాలని నోటీసులో పేర్కొంది. తాలిబాన్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సాదిక్ అకిఫ్ ముజాహిర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కొన్ని వారాల క్రిత‌మే లివిజన్ ఛానెల్‌లు మహిళా నటీనటుల నాటకాలు లేదా సన్నివేశాలను ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం తాజాగా ప్ర‌యాణాల‌కు సంబంధించిన ఈ ఆంక్ష‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

    False Covid 19 Report: కోవిడ్ రిపోర్టులు తారుమారు.. త‌రువాత సారీ చెప్పి ఏం ఇచ్చారంటే!


    అఫ్గానిస్థాన్‌ గత ప్రభుత్వా లు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్‌ ఫెడరల్‌ బ్యాంక్‌ (Fedaral Bank), యూరప్‌ (Europe)లోని అనేక సెంట్రల్ బ్యాంకుల్లో నిల్వ ఉంచింది. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను తాలిబ‌న్లు స్వా ధీనం చేసుకోవడంతో ఆయా దేశాల ప్రభుత్వా లు ఆ డబ్బును తాలిబన్లు తీసుకోవ‌డానికి వీలు లేకుండా నిలిపేశాయి. అక్క‌డి ప్ర‌భుత్వాన్ని అంత‌ర్జాతీయ స‌మాజం (International Society) గుర్తించేదాకా ఈ నిలుపుద‌ల కొన‌సాగుతుంద‌ని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఇప్ప‌డు ఆర్థిక‌, ఆహార సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని తాలిబన్‌ ప్రభుత్వం ఆయా దేశాల‌ను కోరుతోంది. ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్‌కు పాకిస్థాన్ మినహా ఇత‌ర దేశాలు స‌హ‌క‌రించ‌డం లేదు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Afghanistan, Imran khan, Pakistan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు