తాలిబన్లు కాబూల్‌ను హస్తగతం చేసుకున్నతర్వాత... అప్గానిస్తాన్‌లో ఎంతటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాం. తాలిబన్ల పాలనలో అక్కడ బతికి బట్టకట్టలేమని ఎంతో మంది అప్గాన్లు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి ఏదో ఒక విమానం ఎక్కి వెళ్లిపోయేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు అక్కడ అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. బ్యాంకులు కూడా తెరుచుకోవడం లేదు. ఏటీఎంలు మూతపడే ఉన్నాయి. చేతిలో డబ్బులు లేక.. కుటుంబాన్ని పోషించుకోలేక.. అప్గాన్లు అల్లాడిపోతున్నారు. తాలిబన్లు వచ్చాక అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అస్వాక న్యూస్ ఏజెన్సీ వీడియో రూపంలో బయటపెట్టింది. ఓ వ్యక్తి డబ్బుల కోసం తన ఇంట్లో ఉన్న వస్తువులన్నంటినీ రోడ్డుపై పెట్టి అమ్మేస్తున్నాడు. వచ్చిన డబ్బుతో బ్రెడ్ కొని భార్యాపిల్ల కూలి తీర్చుతున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అప్గానిస్తాన్‌కు చెందిన అస్వాకా న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి కాబూల్ శివారులో రోడ్డు పక్కన ఫర్నిచర్ అమ్ముతూ కనిపించాడు. అతడి వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లి ఏం చేస్తున్నావు అని అడిగారు. బ్యాంకులు మూతపడడంతో చేతిలో డబ్బులు లేక.. ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌ను అమ్ముతున్నట్లు వివరించాడు. బట్టలు, గిన్నెలు, దుప్పట్లు, కుర్చీలు.. ఇలా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను రోడ్డ మీదకు తెచ్చి అమ్మకానికి పెట్టాడు. ఆ వస్తువులను అమ్ముతూ రోజుకు 60 AFS సంపాదిస్తున్నాడు. అంటే భారత కరెన్సీలో కేవలం 50 రూపాయలు. వచ్చిన ఆ కొద్ది డబ్బులతో ఐదు బ్రెడ్ కొని కుటుంబ సభ్యుల ఆకలి తీర్చుతున్నాడు.
Person selling his house hold items on the road in #Kabul says, Banks are closed I’m earning 60Afs (80 $ cents ) daily by selling these goods to buy 5 breads for home. President fled and left us alone. Request international to increase humanitarian aids. #Afghans #Afghanistan pic.twitter.com/KrsxPSnYjp
— Aśvaka - آسواکا News Agency (@AsvakaNews) August 27, 2021
కాబుల్ లో మరో ఉగ్రదాడి జరగొచ్చు.. హెచ్చరించిన అమెరికా
ఐతే ఆ వ్యక్తి పేదవాడేం కాదు. బ్యాంకులో బోలెడన్ని డబ్బులు ఉన్నాయి. కానీ బ్యాంకులు, ఏటీఎంలు మూతపడడంతో ఒక్క పైసా కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. అందుకుే ఇంట్లో ఉన్న సామను తీసుకొచ్చి అమ్ముతున్నాడు. రోడ్డు మీదుగా వెళ్లే చాలా మంది ఆ వస్తువులను చూసి ఆగుతున్నారు. కానీ కొనేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఎందుకంటే అతడిలాగే.. వారి వద్ద కూడా చేతిలో డబ్బులు లేవు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పారిపోయిన తర్వాత.. దేశం ఆర్థికంగా చితికిపోయిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అంతర్జాతీయ సమాజం కలుగజేసుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
US Drone Strike: అమెరికా ప్రతీకారం.. అతడిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి..
ఇక కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దేశం విడిచి వెళ్లేందుకు వేలాది అప్ఘన్లు విమానశ్రయం బయట పడిగాపులు కాస్తున్నారు. ఏదో ఒక విమానం ఎక్కి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వారిని అమెరికా భద్రతా దళాలు లోపలికి రానీయడం లేదు. ఐనా అలాగే చాలా మంది ఎయిర్‌పోర్టు బయట ఎదురుచూస్తున్నారు. తిండి, నీరు లేక చాలా మంది అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా అక్కడి వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచారు. ఒక్క వాటర్ బాటిల్ ధర భారత కరెన్సీలో రూ.5వేలకు అమ్ముతున్నారు. ప్లేటు భోజనం చేయాలంటే రూ.7,500 ఖర్చు చేయాల్సిందే. అంతటి ఘోరమైన..దయనీయమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి.
Afghanistan: కాబూల్ పేలుళ్ల వెనుక ISIS-K హస్తం.. అసలు వీళ్లెవరు? తాలిబన్లతో లింకేంటి?
కాగా, గురువారం సాయంత్రం కాబూల్ ఎయిర్‌పోర్టులో వరుస పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఐసిస్-కే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనల్లో దాదాపు 200 మంది మరణించారు. మరో 300 మంది గాయపడ్డారు. మృతుల్లో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు కూడా ఉన్నారు. కాబూల్ పేలుళ్లతో అప్గాన్ ప్రజల్లో మరింత భయాందోళనలు మొదలయ్యాయి. ఎలాగైనా సరే దేశం విడిచి వెళ్లిపోవాలని చాలా మంది ఎయిర్‌పోర్టుకు తరలి వెళ్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Kabul blast, Taliban