తాలిబన్లను కాల్చిచంపిన బాలిక.. తల్లిదండ్రుల శవాల సాక్షిగా ప్రతీకారం

తాలిబన్లను కాల్చిచంపిన బాలిక.. తల్లిదండ్రుల శవాల సాక్షిగా ప్రతీకారం

తాలిబన్లను చంపిన బాలిక (Image:Twitter)

తాలిబన్లను హతమార్చిన ఆ బాలిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెను హీరోగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు.

 • Share this:
  కూతురు కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది. తల్లిదండ్రులను తాలిబన్లు కిరాతకగా కాల్చిచంపారు. ఆ బాలికకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వేరొకరైతే భయంతో ఏడ్చేవారు. కానీ ఆమె అలా చేయలేదు. తమ తల్లిదండ్రులను చంపిన తాలిబన్లపై అప్పటికప్పుడే ప్రతీకారం తీర్చుకుంది. ఇంట్లో ఉన్న తుపాకీ తీసి తాలిబన్ల గుండెల్లో తూటాలు దిపింది. ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఘటన జరిగింది.

  అసలేం జరిగిదంటే..
  గత వారం గ్రీవా గ్రామ అధ్యక్షుడి ఇంటిపై తాలిబన్లు దాడి చేశారు. అతడు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న కోపంతో ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. అడ్డుకునేందుకు వచ్చిన భార్యను చంపేశారు. అక్కడికక్కడే భార్యాభర్తలిద్దరు మరణించారు. ఆ సమయంలో వారి కూతురు ఖాదర్ గుల్ (16) ఇంట్లోనే ఉంది. కళ్ల ముందే తల్లిదండ్రులను చంపేయడంతో.. వారిపై కోపంతో ఊగిపోయింది. ఇంట్లో ఉన్న ఏకే-47 అసాల్ట్ రైఫిల్‌తో తాలిబన్ల బుల్లెట్ల వర్షం కురిపించింది. కాల్పుల్లో ఇద్దరు తాలిబన్లు చనిపోగా మరికొందరు గాయపడ్డారు.

  ఆ తర్వాత మరికొందరు తాలిబన్లు వచ్చి బాలిక నివాసంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ గ్రామస్తులు అడ్డుకొని వారిని ఊరి నుంచి వెళ్లగొట్టారు. తాలిబన్లను హతమార్చిన ఆ బాలిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమెను హీరోగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే 14 నెలల్లో అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఉపసంహరించుకోనున్నారు. ఐతే ఈ ఒప్పందం జరిగినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పేట్రేగుతూనే ఉన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు